న్యూఢిల్లీ: ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ న్యూఢిల్లీలోని పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ ను కలిశారు.
కేంద్ర-రాష్ట్ర సహకారంతో ఏపీలో అభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించారు. సమాచార వ్యవస్థ, పార్లమెంటరీ సమన్వయం మరియు పరిపాలనా సమన్వయం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంత్యోదయ మరియు వికసిత్ భారత్ లక్ష్యాలను ప్రస్తావించారు.
జాతీయ విధాన ప్రాధాన్యతలు మరియు వ్యూహాత్మక పరిపాలనపై కేంద్ర మంత్రులతో మంత్రి సత్యకుమార్ యాదవ్ చర్చించారు. కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్ , ఎల్. మురుగన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. వారి అనుభవం మరియు కార్యక్రమాలు ఏపీకి ఉపయోగపడేలా వారితో మాట్లాడాను,” అని సత్య కుమార్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.