పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ను అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్న వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ నేతలు ట్విట్టర్ వేదికగా తిప్పికొడుతున్నారు. ఆ క్రమంలో వారు పేలుస్తున్న సెటైర్లు సోషల్మీడియాలో పేలుతున్నాయి.
నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు
నాటి చంద్రబాబు ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని స్వయంగా నీ సవాంగన్నే చెప్పారు జగన్ రెడ్డి. సమాచార హక్కు చట్టం ప్రకారం 25-7-21 న కర్నూలు జిల్లాకి చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు అటువంటి సాఫ్ట్ వేర్ ఏదీ కొనలేదని స్వయంగా నాటి డిజిపి సవాంగ్ 12-8-21న సమాధానం ఇచ్చారు. తాను, తన మీడియా చేసేవన్నీ అసత్య ప్రచారాలే అని స్వయంగా జగన్ బయటపెట్టడమే దేవుడి స్క్రిప్ట్.
జగన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏంటో?: మాజీ మంత్రి కె.ఎస్. జవహర్
తప్పుడు పనులు చేసి చిప్ప కూడు తినడానికి ఆయన జగన్ రెడ్డి కాదు… చంద్రబాబు! స్వలాభం కంటే వ్యవస్థలే ముఖ్యం అని బలంగా నమ్మే గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు. అందుకే మూడేళ్ల నుండి మూడు చెరువుల నీళ్లు తాగావే తప్ప ఆయన వెంట్రుక కూడా పికలేక పోయారు జగన్ రెడ్డి గారు.
నాటి ప్రభుత్వం పెగసిస్ సాఫ్ట్ వేర్ కొనలేదని మీ అన్న సవాంగ్ గారు ఇచ్చిన సమాధానం చూసాకా జగన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఏంటో?
బాబాయ్ వివేకా ని కాపాడేవాళ్లం కదా: టిడిపి శాసనమండలి సభ్యులు బి.టెక్ రవి
మా దగ్గర పెగసిస్ ఉంటే అబ్బాయిల గొడ్డలిపోటు నుండి బాబాయ్ వివేకా ని కాపాడేవాళ్లం కదా! జగన్ రెడ్డి.