టికెట్ తీసుకుని రెండు గంటల ముందే రైల్వే స్టేషన్ వెళ్లి, వాహనం పార్క్ చేయడం వరకు నిజం. సీసీ కెమెరాల దృశ్యాలు అంతవరకు ఉన్నాయి. తర్వాత ఆయన మాయమయ్యారు. ఈ రుజువులు లేవు. కిడ్నాప్ చేసి హత్య చేశారా? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి లేఖ తరహాలో డ్రైవర్‌పై అనుమానం వచ్చేలా… సతీష్ కుమార్ మొబైల్ నుండి ‘ఒంట్లో బాగోలేదని’ ఆయన భార్యకు మెసేజ్ చేశారా? ఆయన లగేజ్ కూడా వేరే బర్త్ దగ్గర పెట్టి, ట్రైన్ లో ఉన్నట్లుగా నమ్మించడానికి ట్రై చేశారా? ఆత్మహత్య చేసుకోవడానికి రైలు నుండి దూకి పడిపోయినట్లుగా… తల వెనుక రాయి తగిలి చనిపోయినట్లుగా… అక్కడికి ఏ వాహనం వచ్చిన ఆనవాళ్లు లేవని, కాబట్టి ఇది ఆత్మహత్యే, హత్య కాదు అని పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాకముందే సాక్షి పత్రిక రాసినప్పుడే అనుకున్నా. ఇది పక్కాగా హత్య అని.
వంద కోట్లకు పైగా ఆస్తులను ఒక్క లావాదేవీలో…కేవలం ఒక పరకామణి దొంగతో రాజీ చేసి… కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి తమ బినామీల పేర్లతో… రవికుమార్ ఆస్తులు కొట్టేశారు. శ్రీవారి కేసునే లోక్ అదాలత్‌లో సెటిల్మెంట్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో… టీటీడీ నుండి మింటుకు తరలించే సమయంలో కేజీల కొద్దీ బంగారం దొంగిలించారు. ఆయన హయాంలో పెరిగిన ఈ శక్తిమంతమైన వ్యక్తులు, ఒక పరకామణి నేరాన్ని వదిలేస్తారా? సెటిల్మెంట్ చేసి, ఆస్తులు కొట్టేసి, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో.. పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ హత్యను చూసిన తర్వాత, నిందితుడు రవికుమార్ తో పాటు సాక్షులకు కూడా రక్షణ కల్పించాలి అని ఏపీ హైకోర్టు తాజాగా సీఐడీ డీజీకి ఆదేశాలు ఇచ్చింది.”
– చాకిరేవు