విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై. సత్య కుమార్ యాదవ్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు.బిజేపి శ్రేణులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.
ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ మంత్రి వై సత్య కుమార్ ను ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్, బిజెపి రాష్ట్ర ఇంఛార్జి కీలారు దిలీప్, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామి,బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, రాష్ట్ర కార్యాలయం ఇంఛార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.