– ఐదు శాతం ఎక్కువ కు ఇస్తున్నారు.
– వీటన్నిటి వివరాలు త్వరలో బయట పెడతా
– ఓ ఆర్ ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉంది
– మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్ లో మైనింగ్ దందా
– ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ లను పూట పూటకు మార్చడం వల్ల పాలన లో ఫలితాలు రావు
– ఈ బదిలీల ,ఎక్స్టెన్షన్ పద్ధతి మంచిది కాదు
– ఊ అంటే పోస్టింగ్ ఆ అంటే పోస్టింగ్.
– మీడియాతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నాయకుడు టి హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్: రాష్ట్రం లో రేవంత్ కు పాలన రావడం లేదు.ఐ ఎ ఎస్, ఐ పి ఎస్ లను పూట పూటకు మార్చడం వల్ల పాలన లో ఫలితాలు రావు. ఇప్పటి వరకు ఐదు సార్లు భారీ గా మార్పులు చేర్పులు జరిగాయి. విభాగ అధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదు.
విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలం లో ఐదుగురు అధికారులు మారారు. విద్యుత్ శాఖలో అధికారుల మార్పు తీవ్ర ప్రభావం చూపింది. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలాకుతలం అయింది. అవినీతి మయం అయింది. సింగరేణి లో కూడా నలుగురు మారారు. జి హెచ్ ఎం సి లో కూడా నలుగురు అధికారులు మారారు. ఐ అండ్ పీ ఆర్ లో కూడా నలుగురు మారారు.
పాఠశాల విద్యాశాఖలో కూడా నలుగురు మారారు. ఆరోగ్య శ్రీ లో ఎనిమిది మంది మారారు. పంచాయతీ రాజ్ శాఖలో నలుగురు మారారు. మున్సిపల్ శాఖలో ఐదుగురిని మార్చారు. ఐటీ శాఖ లో ముగ్గురు మారారు. మైనింగ్ శాఖ లో ఆరుగురు మారారు. నేషనల్ హెల్త్ మిషన్ లో ముగ్గురిని మార్చారు.
ఇట్లా మారిస్తే పాలన ఎలా నడుస్తుంది?.జోక్ అయిపోయింది. 140 మంది ఐ ఏ ఎస్ లను బదిలీ చేశారు. 20 మంది కలెక్టర్లను మార్చారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్టర్లు మారారు.. ఢిల్లీ తో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోంది.. కలెక్టర్ కు జిల్లా పై అవగాహనా రావడానికే ఆరునెలలు పడుతుంది. ఆరునెలల లోపే మార్చిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారు.
కలెక్టర్లను ముఖ్యంగా యువ కలెక్టర్లను బదిలీ చేయడం వల్ల వారి నైతిక స్థయిర్యం దెబ్బ తింటోంది. వాళ్లకు నచ్చితే మంచి పోస్టింగ్ లు ..లేక పోతే బదిలీలు. ఊ అంటే పోస్టింగ్ ఆ అంటే పోస్టింగ్. సీఎం, మంత్రులకు నచ్చక పోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడగింపు సాధారణం అయిపోయింది.
డజన్ మంది ఐ ఏ ఎస్ ,ఐపీఎస్ అధికారుల కు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. వందల మంది ఇంజినీర్ల కు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారు. బి ఆర్ ఎస్ హయం లో అధికారుల పదవీ కాలం పొడగింపు పై ఇదే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. వాళ్ళు చేస్తున్నదేమిటీ ? యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లలో ఐదు శాతం ఎక్కువ కు ఇస్తున్నారు. వీటన్నిటి వివరాలు త్వరలో బయట పెడతా.
ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోం.ది అధికార్లను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. కలెక్టర్లకు కనీసం రేండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయి. కేసీఆర్ హయం లో రాష్ట్రం మోడల్ స్టేట్ అయిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛ నిచ్చి పని చేయించారు.
ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్దతి కాదు. తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సీఎం వారిని బదిలీ చేస్తున్నారు. బెదిరిస్తున్నారు.. సీఎం తప్పులకు తామెందుకు భాద్యులం కావాలని అధికారులు భావిస్తున్నారు. . ఈ బదిలీల ,ఎక్స్టెన్షన్ పద్ధతి మంచిది కాదని పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిగా ఈ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాం.
ఈ సలహాలను విమర్శలుగా కాకుండా నిర్మాణాత్మక సూచనలు గా స్వీకరించాలని కోరుతున్నాం. అధికారులను సీఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలి. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడ్నుంచి బదిలీ చేశారు.
ఐటీ కార్యదర్శిగా సీ ఎస్ ఎలా పని చేయగలుతారు ? సీ ఎస్ కు బోలెడన్నీ భాద్యతలు ఉంటాయి. అదనంగా ఐ టీ కార్యదర్శిగా ఎలా భాద్యతలు నిర్వర్తిస్తారు? ? 20 శాతం జీవో లు ఆన్ లైన్ లో ఉంచుతున్నారు ..80 శాతం జీ ఓ లు ఆఫ్ లైన్లో ఉంచుతున్నారు. మా ఎర్రోళ్ల శ్రీనివాస్ హై కోర్టు కు వెళితే నాలుగు వారాల్లో జీవో లు ఆన్ లైన్లో పెట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశించినా జీవో లు ఆన్ లైన్ లో పెట్టడం లేదు. ప్రతిపక్షం లో ఉండగా కాంగ్రెస్ జీవో ల పై ఏం మాట్లాడింది ?ఇపుడేం చేస్తున్నారు
మా సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిది. .లేదంటే వారి ఖర్మ..
వరంగల్ ఎం జి ఎం లో ఎలుకలు , జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు. రాష్ట్రం లో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇట్లా తయారైంది. మేము వాడుకోవడానికి అనువుగా కట్టిన మార్చురీ లను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదు.
ఫిరాయింపుల విషయం లో కౌన్సిలర్ల కు ఓ నీతి ?ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓ నీతా ? అంతా జోక్ అయిపోయింది. అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు. అసెంబ్లీ అసెంబ్లీ లా లేదు.. హౌస్ కమిటీలు వేయడం లేదు. .డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదు.. చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉంది.ఇలా ఎపుడు జరగలేదు. .అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదు.
రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్ కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్ లో పెట్టారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలి. లెటర్ లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోంది. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారు. అక్కడ రెడీమిక్స్ కు పర్మిషన్ లేదు.
పటాన్ చెరు ఎమ్మెల్యేకు మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారు. దాదాపు 8 నుంచి 9 పర్మిషన్లు తీసుకోవాలి. ఓ ఆర్ ఆర్ కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉంది. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్ లో మైనింగ్ దందా నడుపుతున్నది. రేపు నిజానిర్ధారణ కోసం బిఆర్ఎస్ బృందం వెళ్తుంది.
ఖమ్మంలో ఇళ్ళు కూలగొట్టి జాగా ఇస్తామని అంటున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేగలుగుతున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి. రేపటి వరకు వేచి చూద్దాం.నేను మంత్రిగా వున్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చాను. జర్నలిస్టులకు పెట్టిన 16 కోట్ల బడ్జెట్ కు ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
ఎడ్యుకేషన్ పాలసీని వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారు. పాలసీ బాగుంటే ఎందుకు మాయం అయింది? అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదు. ఎడ్యుకేషన్ కమీషన్ రిపోర్టుపై బిఆర్ఎస్ మొదట మాట్లాడింది. ప్రతిపక్షంగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడం లో సఫలం అవుతోంది. మా ఒత్తిడికి తలొగ్గే ప్రభుత్వం వివిధ అంశాలపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది..