-75 లక్షల రైతుల భూములు రాత్రికి రాత్రే మాయం అవ్వొచ్చు
-కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చకా టైటిల్ గ్యారంటీ తీసుకువస్తాం
-అసైన్డ్ భూములను తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇస్తున్నారు
-గాంధీ భవన్ నుంచి జాతీయ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో వేలకోట్ల రూపాయలు దండుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన భూములు గుంజుకుని, కమిషన్లు తీసుకున్న కంపెనీలకు, బడా భూస్వాములకు ధారాదత్తం చేస్తున్నారని, టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరామిరెడ్డి, మాజీ ఎంపి మల్లు రవి ఆరోపించారు. ఆ మేరకు వారు గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.
కోదండ రెడ్డి ఏమన్నారంటే… కాంగ్రెస్ పార్టీ ఏ సంస్కరణలు తీసుకువచ్చిన బాధ్యతగా చట్ట పరంగా భద్రత కల్పించే విధంగా ఉంటుంది.ధరణి రికార్డుల ప్రక్షాళన పైన గ్రామ గ్రామాన తిరిగి హక్కుదారులకు నుంచి చాలా విషయాలు సేకరించాం. రేవంత్ రెడ్డి ధరణి పేరుతో పెద్ద మాఫియా జరుగుతుందనీ లోతుగా విశ్లేషించిన తర్వతే మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి పేరుతో కుంభ కోణాలు జరుగుతున్నాయి
సీఎం కేసిఆర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎస్ ను పక్కన పెట్టుకొని వేల కోట్ల రూపాయలు కాజేసారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో పేద రైతులకు ఇచ్చిన భూములకు గుంజుకుంటున్నారు.రెవెన్యూ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని భూ డిక్లరేషన్ తీసుకొచ్చాం.ఇప్పటికీ వరకు 75 లక్షల రైతులకు మాత్రమే పట్టపాసు బుక్కులు ఇచ్చారు.ఈ 75 లక్షల రైతుల భూములు రాత్రికి రాత్రే మాయం అవ్వొచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వేస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ధరణి ఎత్తి వేస్తే రైతు బంధు రాదనీ కేసిఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.సమాధానం చెప్పలేక రేవంత్ పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.ధరణి పోర్టల్ లో జరిగిన అవకవతవకల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి.భూములు సర్వే జరగకుండా పట్ట ఇచ్చే హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చకా టైటిల్ గ్యారంటీ తీసుకువస్తాం.
మల్లు రవి ఏమన్నారంటే… దొంగే దొంగా దొంగా అని అరేశ్నట్టుగా కేసిఆర్ కేటీఆర్ మాట్లాడుతున్నారు.కాంగ్రెస్ పార్టీకి టెక్నాలజీ కొత్తేం కాదు.టెక్నాలజీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర పెట్టి కేసిఆర్ చేతుల్లో కీ పెట్టుకున్నారు.కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇచ్చిన అసైన్డ్ లండ్స్ అన్ని ధరణి పోర్టల్ లో నిషేదం లిస్ట్ లో పెట్టి అక్రమాలు చేస్తున్నారు.అసైన్డ్ భూములను తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఇస్తున్నారు.
పరిశ్రమలకు ప్రాజెక్టులకు అసైన్డ్ భూములు వాడినట్లుగానే…. దళితులకు గిరిజనులకు ఇస్తానన్న భూములు ఇవ్వాలి.ప్రభుత్వం గుంజుకున్న పేద ప్రజల అసైన్డ్ భూములన్నీ తిరిగి వాళ్లకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది