Suryaa.co.in

National

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌…ఆగస్టు 6న పోలింగ్

భార‌త ఉపరాష్ట్రప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక సంఘం బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం జులై 5న ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే రోజు నుంచి నామినేష‌న్ల దాఖ‌లు ప్రారంభం కానుండ‌గా… జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు అనుమతించనున్నారు.

జులై 20న నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుండగా… నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు జులై 22 వ‌ర‌కు గ‌డువు విధించారు. ఇక ఉపరాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌ను ఆగ‌స్టు 6న ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే అదే రోజుల ఓట్ల లెక్కింపును నిర్వ‌హించనున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం విజేత‌ను ప్ర‌క‌టించ‌నుంది.

LEAVE A RESPONSE