– 26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియా కలకలం రేపుతున్నాయి. 26 జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. వారం, పది రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్స్ బయటపడతాయి. చిత్తూరు (379), కాకినాడ (141), విశాఖ (123), కడప (91, నెల్లూరు (86), అనంతపురం (68), విజయనగరం (59) తదితర జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.