– ఇష్టం వచ్చినట్లుగా 16 మందిని ప్రభుత్వ సలహాదారులు
– ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్న జీవోలని కప్పిపెట్టి బయటకు రాకుండా చూస్తున్నారు
– బీ ఆర్ ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇల్లీగల్ గా కేబినెట్ నడుపుతుంది , చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఫిల్ దాఖలు చేశాము. ఇష్టం వచ్చినట్లుగా 16 మందిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఢిల్లీకి మూటలు మూసేవారికి కూలోళ్లని పెట్టుకుంటే సరిపోతుంది కదా, 16 మంది సలహాదారులు ఎందుకు? ఇష్టం వచ్చినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అప్పులు పుట్టడం లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నట్లు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి అనేక విషయాలు చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగ హక్కులను కాపాడుతామని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు.
మరి ఇవ్వాళ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎందుకు పాలన చేస్తున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి… రాము ఒకసారి రెమో ఒకసారి అవుతాడని కేటీఆర్ అంటుంటారు. కేబినెట్ హోదాతో ఉన్న 16 మంది అడ్వైజర్లను తొలగించాలని కోర్టులో ఫిల్ దాఖలు చేశాము. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావొస్తోంది, అప్పటి నుంచి అధికార దుర్వినియోగం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ , కొందరిని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటే రాజ్యాంగ విధ్వంసం జరుగుతుందని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇవాళ ఇష్టం వచ్చినట్లు 14 మందిని ప్రభుత్వ సలహాదారుగా ఎలా పెట్టుకున్నారు. కేబినెట్ కు సమానంగా, 14 మంది ప్రభుత్వ సలహాదారులతో మరో రహస్య క్యాబినెట్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చెయ్యని వారు ఇందులో ఉన్నారు.
ప్రజా ధనాన్ని ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పదలచుకున్నాము. ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్న జీవోలని కప్పిపెట్టి బయటకు రాకుండా చూస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో ఆనాడు అడ్వైజర్లగా IAS అధికారులను కేసీఆర్ నియమించారు. కొట్లాట చేసి తెచ్చుకున్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేందుకు IAS అధికారులను సలహాదారులుగా పెట్టుకుంటే అధికార దుర్వినియోగం అవుతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకి నచ్చిన వాళ్ళని 14 మందిని ఇష్టానుసారంగా ప్రభుత్వ సలహాదారులుగా ఎలా పెట్టుకుంటారు? ఓటుకు నోటు దొంగ వేం నరేందర్ రెడ్డినీ ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు.
ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పైన నిందలు వేసి , కోర్టుకు వెళ్ళిన మీరు, ఇవ్వాళ మిమ్మల్ని కోర్టుకి వీడుస్తాము. దోపిడి దొంగలను ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారు, దీని మీద కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని కూని చేస్తుంది రేవంత్ రెడ్డి కొందరు జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. 18 నెలల దాకా 11 మంది మంత్రులతో ప్రభుత్వాన్ని నడిపారు. ముఖ్యమంత్రితో 12 మంది మాత్రమే. భారత రాజ్యాంగాన్ని ఖునీ చేస్తుంది మీరు కాదా రేవంత్ రెడ్డి, దేశం మొత్తం అంబేత్కర్ రాజ్యాంగ నడుస్తుంటే , తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది.
ఈ విషయం IAS చదువుకున్న CS కి తెలియదా, చదువు రాని రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు కదా? మైనార్టీ శాఖకి మంత్రి లేకపోవడం ఇదే తొలిసారి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది అని అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్రంలో హోం మంత్రి లేడు , లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల మంత్రులుగా సమర్ధులు కారు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. నాలుగు కోట్ల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించ అంశం ఇది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్.
ఈరోజు హై కోర్టులో ఫిల్ దాఖలు వేశాము, కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. ఎవరి ప్రయోజనాలకోసం ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకున్నారో చెప్పాలి. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకు రాహుల్ గాంధీ దీని పైన స్పందించడం లేదు. ప్రెస్ మీట్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఇంతియాజ్ అహ్మద్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ ,ఎస్సీ ,ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్ నాయక్ ,బీ ఆర్ ఎస్ నేతలు గోసుల శ్రీనివాస్ యాదవ్ ,కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.