Suryaa.co.in

Telangana

సమస్యల రహిత నియోజకవర్గంగా సికింద్రాబాద్

– డిప్యూటీ స్పీకర్ పద్మారావు

సిసికింద్రాబాద్ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నామని, అడ్డగుట్ట ప్రాంతాన్ని సమస్యల రహితంగా తీర్చిదిద్దామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట కు కొత్తగా రూ.13.05 కోట్లతో 30 పడకల ఆసుపత్రిని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించమని ఆయన వెల్లడించారు. అడ్డగుట్టలో రూ.1.39 కోట్ల ఖర్చుతో వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం ప్రారంభించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, అధికారులు, నాయకులతో కలిసి అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

వడ్డెర బస్తీ, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్, బీ సెక్షన్, శాస్త్రి నగర్, తుకారాం గేట్, లోహియా నగర్, కొండా రెడ్డి నగర్ ప్రాంతాల్లో సివర్ లైన్లు, మంచి నీటి పైప్ లైన్లు, రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు తమను ఆదరిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలను పరిష్కరించామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. లోహియా నగర్ సమీపంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజ శేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు దీపిక, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ లతో కలిసి సివరేజ్ లైన్ ను ప్రారంభించారు.

LEAVE A RESPONSE