Suryaa.co.in

Andhra Pradesh

ఏ వ్యవస్థకైనా స్వీయ నియంత్రణ తప్పనిసరి: చెవిరెడ్డి

ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తాను న్యాయవ్యవస్థల మంచి కోసమే మాట్లాడుతున్నానని అన్నారు. స్వీయ నియంత్రణ ఏ వ్యవస్థకైనా తప్పనిసరి అని తెలిపారు. ప్రతీ వ్యవస్థకూ కొన్ని పరిధిలు ఉంటాయని అన్నారు. దేశానికి రాజ్యాంగమే సుప్రీమని అన్నారు. న్యాయ వ్యవస్థ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.

జడ్జిలు చేసే తప్పులపై విచారణ జరిపే అధికారం రాష్ట్రపతి ఆధ్వర్యంలోని వ్యవస్థకు ఉండాలని ప్రతిపాదించారు. యూపీఎస్‌సీ తరహాలోనే న్యామమూర్తుల ఎంపిక జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు.

రాజధాని పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యం: పార్థసారధి
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని అన్నారు. మూడు రాజధానుల అంశం కులాల సమస్య కాదని తెలిపారు. దీన్ని ప్రాంతాల మధ్య సమతుల్యతగా భావించాలని పేర్కొన్నారు. రాజధాని పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దశంతో రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే తప్పేముందని అ‍న్నారు. పారిపాలన రాజధానిగా విశాఖపట్నంను డిసైడ్‌ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE