– ఏపీ బిజెపి చీఫ్ మాధవ్
విజయవాడ: ప్రతి మండలంలో జీఎస్టీపై సెమినార్లు నిర్వహించనున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం పార్టీ శ్రేణులు తో ఎ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలు ,చిన్న వ్యాపారస్థులకి మంచి చేయాలనే ఉద్దేశంతో జీఎస్టీ పై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన సరళీకృత సంస్కరణ వల్ల అందరికీ మేలు జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా సరళీకృత జీఎస్టీని స్వాగతిస్తూ ప్రజలు, రైతులతో మమేకమవుతు, తెలియచేసే విధంగా కార్యక్రమం చేయాలని పిలుపునిచ్చారు. ఈ గొప్ప చారిత్రాత్మక నిర్ణయం నరేంద్ర మోదీ తీసుకున్న నేపథ్యంలో ప్రతి మండలంలో భారీ స్థాయిలో ఒక సెమినార్ నిర్వహించి ప్రజలకి అవగాహన చేయాలి. ప్రజలతో మమేకమై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఒక వైపు సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తోన్న నేపథ్యంలో సరళీకృత జిఎస్టీ పై సెమినార్లు నిర్వహించాలని మాధవ్ పిలుపునిచ్చారు.