– కీలక రంగాలకు దిగ్గజాలు సలహాదారులుగా రాక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక రంగాల అభివృద్ధికి నడుం బిగించింది! రాష్ట్ర భవిష్యత్తును మార్చేందుకు దిగ్గజాలను సలహాదారులుగా నియమించి సంచలనం సృష్టించింది..
అంతరిక్ష సాంకేతికతకు ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ దిశానిర్దేశం: ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ నియామకం. స్మార్ట్ సిటీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో స్పేస్ టెక్నాలజీని అనుసంధానించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఆయన అనుభవం ఎంతో తోడ్పడుతుంది.
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు DRDO మాజీ చీఫ్ సతీష్ రెడ్డి సలహాలు: ప్రభుత్వ గౌరవ సలహాదారుగా DRDO మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి నియామకం. ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫేక్చరింగ్ హబ్ అభివృద్ధికి ఆయన విలువైన సలహాలు అందించనున్నారు. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్లు పదవిలో కొనసాగుతారు.
చేనేత, హస్తకళల అభివృద్ధికి సుచిత్ర ఎల్లా చేయూత: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లాను చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా నియమిస్తూ ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని కళాకారులకు ఆమె సలహాలు, సూచనలు ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయి.
ఫోరెన్సిక్ రంగానికి KVP గాంధీ మార్గదర్శకత్వం: ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గౌరవ సలహాదారుగా కేవీపీ గాంధీ నియామకం. రాష్ట్రంలో నేర పరిశోధనలకు ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడనుంది.
ఈ నియామకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రంగాల్లో అభివృద్ధికి కొత్త ఊపును తీసుకురావాలని భావిస్తోంది. ఈ దిగ్గజాల అనుభవంతో రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందని ఆశిద్దాం.