-ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా శేషు చెప్పగలరా? కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లు జగన్ రెడ్డి రద్దు చేస్తే తన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను గాలికొదిలాడు. కాపులకు అనేక రకాలుగా ప్రయోజనాలు కల్పించిన తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాజంపేట పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్, టీడీపీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి వచ్చాక ఈ స్థానంలో బలిజలకు మొండి చేయి చూపి. దాన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికిచ్చారు. వై.ఎస్.కుటుంబం రాజకీయాల్లోకి రాకముందు పులివెందుల పంచాయతీ సర్పంచ్‌గా బలిజలు ఉండేవారు. ఇప్పుడు అక్కడ అన్ని పదవులు జగన్ రెడ్డి కుటుంబానివే. కడప, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో గతంలో బలిజలు ఎమ్మెల్యేలుగా ఉండేవారు. అవన్నీ ఇప్పుడు జగన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారు.
తిరుపతిలో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆయనపై భూమన కరుణాకర రెడ్డి దాడి చేశారు. టీటీడీ ఛైర్మన్‌గా తెలుగుదేశం బలిజలకు ఇవ్వగా జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టారు. బత్యాల చెంగల్రాయుడు అన్నను వై.ఎస్.రాజారెడ్డి రైల్వే కోడూరులో హత్య చేయించాడు. తిరుపతిలో అత్యధికంగా బలిజలుండగా టీడీపీ బలిజలకే ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. కానీ జగన్ రెడ్డి ఇవ్వలేదు. రాయలసీమలో బలిజల విద్యా సంస్థలపై జగన్ రెడ్డి దాడులు చేయించారు. మాజీ మంత్రి నారాయణపై అక్రమ కేసులు పెట్టించారు.