– ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
విజయవాడ: కొత్తవలస మండలం బలిఘట్టంలో ఎంఎస్ఎంఈ పార్కును మంజూరు చేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అసెంబ్లీ లో కోరారు. 2018 లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు గ్రామ రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 141లో సుమారు 89 మంది రైతులు నుంచి 52.55 ఎకరముల జి-పట్టా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 6.25 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించే పార్క్ నిర్మాణం కొరకు ఏపీఐఐసీ ద్వారా సేకరించడం జరిగిందనని, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిందన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఎంఎస్ఎం ఈ పార్కు మంజూరు చేయాలని కోరారు.