– బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
– ఉప్పల్‌లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్
– స్క్రీనింగ్ నుంచి ట్రీట్మెంట్ వరకూ ఉచిత వైద్యసేవలు
– ఎర్లీ డిటెక్షన్, ఆరోగ్యకర జీవనశైలి పై అవగాహన ప్రధాన లక్ష్యం
– బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవాపక్షం కార్యక్రమాల్లో భాగంగా, ఉప్పల్‌లోని సంజన కాంప్లెక్స్‌లో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి ఆధ్వర్యంలో “క్యాన్సర్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్” ను నిర్వహించాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు , మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ , సుభాష్ రెడ్డి , జిల్లా మరియు అసెంబ్లీ స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
మొదటి దశలో స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైతే తదుపరి పరీక్షలు, చికిత్స వరకు పూర్తి వైద్య సహాయం అందించబడుతుంది. హైదరాబాద్ నగరం దేశంలో రెండోస్థానంలో అత్యధిక క్యాన్సర్ కేసులు ఉన్న నగరంగా నిలిచిన నేపథ్యంలో, ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని భావిస్తున్నాం.
ఈ క్యాంప్ ద్వారా ప్రజలకు ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు, సమయానుకూల చికిత్స, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన కల్పించడం, అలాగే క్యాన్సర్ కేసులను తగ్గించడం మా ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది.