– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక పిలుపు:
– వ్యవసాయంలో పెనుమార్పులకు సిద్ధం!
– అన్నదాత సుఖీభవ! మళ్ళీ స్వర్ణయుగం!
– ఈ నెల 24 నుంచి ఏడు రోజులు… “మీకోసం రైతన్నా” బృహత్ కార్యక్రమం!
టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు నాయుడు, వ్యవసాయ రంగంలో గత 17 నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న అద్భుత ప్రగతిని వివరిస్తూనే, ఇకపై సాగును శాశ్వతంగా లాభసాటి చేసేందుకు ‘పంచ సూత్రాల’తో ఒక సమగ్ర కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి రాష్ట్రంలో ఒక చారిత్రక ఉద్యమంలా “మీకోసం రైతన్నా” కార్యక్రమం మొదలుకానుంది.
వ్యవసాయంలో ‘పంచ సూత్రాలు’ – నవశకానికి నాంది సిద్ధాంతాలు కాదు…
రుగా రైతు పొలంలో ఫలితాలు చూపే ఐదు ప్రధాన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది:
* నీటి భద్రత: సమర్థవంతమైన నీటి నిర్వహణ, బిందు సేద్యానికి ప్రాధాన్యం.
* డిమాండ్ ఆధారిత పంటలు: మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో, ఏది వేస్తే ఎక్కువ ధర వస్తుందో ఆ పంటల సాగుకు ప్రోత్సాహం.
* అగ్రిటెక్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూసార పరీక్షల ద్వారా సాగులో విప్లవం.
* ఫుడ్ ప్రాసెసింగ్: పంటకు అదనపు విలువ జోడించి, లాభాలను పెంచడం.
* ప్రభుత్వ మద్దతు: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ వంటి పథకాలతో ఆర్థిక భరోసా.
ముఖ్యమంత్రి మాటల్లో: “ఇప్పటికే 46.50 లక్షల మందికి పైగా రైతులకు ‘అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్’ కింద రెండు విడతల్లో రూ. 6,310 కోట్లు జమ చేశాం. ఈ పంచ సూత్రాలు, ఈ సామాజిక భద్రతతోడైతే… రైతు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.
కార్యక్రమ షెడ్యూల్:
* నవంబర్ 24 నుంచి 29 వరకు (6 రోజులు): గ్రామాల్లో పండుగ వాతావరణం! ప్రజాప్రతినిధులు, అధికారులు నేరుగా ప్రతీ రైతు ఇంటికి వెళ్తారు. పంచ సూత్రాల గురించి, ప్రకృతి సేద్యం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక లాభాల గురించి రైతు కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.
* డిసెంబర్ 3వ తేదీ: రాష్ట్రంలోని అన్ని రైతు సేవా కేంద్రాల (RSC) పరిధిలో వర్క్‌షాపులు. వ్యవసాయ అనుబంధ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొని, యాక్షన్ ప్లాన్ తయారు చేస్తారు. ఈ మొత్తం యజ్ఞంలో సుమారు 10 వేలమంది అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది భాగస్వామ్యం కానున్నారు.
ప్రకృతి సేద్యమే మన బలం! గ్లోబల్ మార్కెట్ మన లక్ష్యం!
సీఎం ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేశారు:
* పెట్టుబడి ఖర్చుల తగ్గింపు: ప్రైవేట్ షాపుల కంటే గ్రోమోర్ కేంద్రాల్లో ఎరువులు తక్కువ ధరకే లభిస్తున్న విషయాన్ని రైతులకు చెప్పాలి.
* ఫుడ్ ప్రాసెసింగ్ శక్తి: పంటలకు మరింత విలువ జోడించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి.
* విష రహిత పంటలు: “పురుగుమందుల వినియోగం వల్ల కలిగే నష్టాలు, సేంద్రీయ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా వివరించండి. కడపలో ప్రకృతి సాగు చూశాను… రైతులు ఎంత సంతృప్తిగా ఉన్నారో!” అని సీఎం ఉద్ఘాటించారు.
* పాడి పశువులు, ఆక్వా, ఉద్యానం: ఈ పంచ సూత్రాలను కేవలం పంట రైతులకే కాక, పాడి రైతులు, ఆక్వా, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు… అందరికీ అందించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి లక్ష్యం ఒక్కటే: సాంకేతికత సహాయంతో, ప్రకృతి సేద్యపు మార్గంలో, రాష్ట్ర రైతాంగాన్ని తిరిగి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడం!