Suryaa.co.in

Telangana

ట్రావెల్ బస్ టైర్ పేలి పలువురికి తీవ్ర గాయాలు

బెంగళూరు నుంచి వరంగల్ వైపు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది.

వివరాల్లోకి వెళ్తే..జనగామ మండలం యశ్వంతపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. రన్నింగ్‌లో బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతోనే అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది.

బస్సు బెంగళూరు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్న ట్టు తెలుస్తుంది, ఈ ఘటన తో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, 23 మందికి స్వల్ప అయినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షత్రగాతులను జనగామ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కాగా, బస్సు బోల్తా పడటం తో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సహాయక చర్యలు ముమ్మ రం చేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

LEAVE A RESPONSE