– డిప్యూటీ స్పీకర్ పద్మారావు
ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలో సీతాఫలమండి, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన రూ. 205 లక్షలకు పైగా విలువ చేసే 204 కళ్యాణ లక్ష్మి, షాదిముబారాక్ చెక్కులను, రూ. 13లక్షలకు పైగా విలువ చేసే 28 CMRF చెక్కులను ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ సీతాఫల్మండి లోని క్యాంపు కార్యాలయంలో అందచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని ఉప
సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని అన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు cmrf ను సద్వినియోగం చేసుకుంటున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అర్హులకు రేషన్ కార్డులను అందిస్తామని తెలిపారు.
– షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు
చేయవచ్చునని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. తాసిల్దార్లు మాధవి రెడ్డి, అయ్యప్ప, కార్పొరేటర్లు రాసురి సునిత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస యువ నేతలు తీగుళ్ళ కిషోర్ కుమార్ గౌడ్ , తీగుళ్ల కిరణ్ గౌడ్, తీగుళ్ల రామేశ్వర్ గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.