– నయీం మటన్ షాపు, సలీం డ్రై క్లీన్ షాపులు పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదు?
– మీరు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే మేం హిందూ కుల వ్రుత్తులను కాపాడుకునే ఉద్యమం చేస్తాం
– రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం
– మార్వాడీ గో బ్యాక్ హిందూ సమాజాన్ని చీల్చే మహా కుట్ర
– కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివి
– పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదు?
– హిందూ కులవ్రుత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రైక్లీన్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరెందుకు మెదపరు?
– ఓట్ల చోరీకి, బీజేపీకి ఏం సంబంధం?
– మేం ఓట్ల చోరీ చేస్తే తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేదా?
– ఇండీ కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా?
– కేంద్రంలో బీజేపీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి?
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
– హైదరాబాద్ యూసుఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కలిసి తిరంగా ర్యాలీని ప్రారంభించిన బండి సంజయ్
హైదరాబాద్: మార్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు.
‘‘ మార్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. తెలంగాణను దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించాలి. జీడీపి పెంపులో వారి పాత్ర చాలా ఉంది. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు. అట్లాంటి మార్వాడీలు తెలంగాణ నుండి ఎందుకు వెళ్లిపోవాలి?’’అని ప్రశ్నించారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని అన్నారు.
హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే… బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతోపాటు రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో బీజేపీ సెంట్రల్ జిల్లా శాఖ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా ర్యాలీ’’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే….
మటన్ ఎవరు కొట్టాలి? హిందువులైన కటికోళ్లు మటన్ కొట్టాలి. హిందూ రజకులు బట్టలుతుకుతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది. నయీం మటన్ షాపు, సలీం డ్రై క్లీన్ షాపులు పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదు? హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది. రోహింగ్యాలు గో బ్యాక్.. హిందువుల కుల వృత్తులను కాపాడాలని మేం ఉద్యమం చేస్తాం.
79వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ర్యాలీలను ఘనంగా నిర్వహిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ మూర్ఖత్వ పాలనలో జాతీయ జెండా పండుగను కూడా నిర్వహించుకోలేకపోయాం. జాతీయ జెండా పండుగను కొందరికే పరిమితం చేశారు. నరేంద్రమోదీ వచ్చాక ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగరేసేలా చర్యలు తీసుకున్నారు. వేలాది మంది బలిదానాలు, లక్షలాది మంది త్యాగాలు, కోట్లాది మంది పోరాటాలవల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
నరేంద్రమోదీ పాలనలో అనేక మార్పులు వచ్చాయి. ఇకపై చరిత్ర చెప్పుకోవాలంటే నరేంద్రమోదీకి ముందు, ఆ తరువాత పాలన అంటూ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. 370 ఆర్టికల్ రద్దుతో శ్యామాప్రసాద్ కలలను సాకారం చేశారు. కాశ్మీర్ పై జాతీయ జెండాను ఎగరేయగలుగుతున్నామంటే
కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలివి. మార్వాడీలు హిందూ సనాతన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్లు ఏనాడూ తెలంగాణ సంపదను దోచుకోలేదు. కొంత మంది మాదిరిగా తెలంగాణను దోచుకోలేదు. ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. వాళ్లు వ్యాపారాలు చేస్తూ తెలంగాణ జీడీపీని పెంపులో కీలక పాత్ర పోషించాలి. ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కుంది. తెలంగాణలో ఇతర రాష్ట్రాలవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు ఉండకూడదని అంటున్నారా?
సిగ్గుండాలే. ఇతర దేశాల నుండి వచ్చిన రోహింగ్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? హైదరాబాద్ లో ఎంతో మంది రోహింగ్యాలు పాతబస్తీని అడ్డాగా మార్చి ఐఎస్ఐ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. రోహింగ్యాలవల్ల ఎప్పటికైనా తెలంగాణకు ప్రమాదముందని నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఓట్లను తొలగించేది, చేర్చించేది ఎన్నికల సంఘం పని. ఓట్లకు బీజేపీకి సంబంధం ఏముంది? ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ద సంస్థ. నిజంగా ఓట్ల చోరీ మా చేతుల్లో ఉంటే మాకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అన్నీ సీట్లలో గెలిచేవాళ్లం కదా?
తెలంగాణ, కర్నాటకలో బీజేపీయే అధికారంలోకి వచ్చేది కదా? నేనడుగుతున్నా తెలంగాణలో ఓట్ల చోరీ చేసే కాంగ్రెస్ గెలిచిందా? ఓట్ల చోరీ చేసే కర్నాటకలో గెలిచిందా? ఓట్ల చోరీ చేసే ఇండీ కూటమి 230 ఎంపీ సీట్లను గెలుచుకుందా? మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం.. ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్లా? వాళ్లు చేస్తే సంసారం… మేం చేస్తే వ్యభిచారమా? ఇదేం పద్దతి?
అంతెందుకు… పాతబస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నాయని అనేక ఆందోళనలు చేస్తున్నారు. ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి? వాటిని తీసేయాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. వాటిని మీరు ఎందుకు తొలగించాలని ఎందుకు ఈసీకి చెప్పడం లేదు?
60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుంది. 11 ఏళ్లపాటు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతోంది. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ బతుకు కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఆ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరిస్తున్నా.