గళమెత్త బీసీల గొంతు పిసికే ప్రయత్నం సిగ్గుచేటు
దాడులు, దౌర్జన్యాలతో టీడీపీ నేతల పోరాటాన్ని అడ్డుకోలేరు
పుంగనూరులో దాడికి గురైన బీసీ నేతలకు కొల్లు రవీంద్ర, వీరంకి వెంకట గురుమూర్తి భరోసా
దాడులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ ర్యాలీ చేపట్టిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేతలపై పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
దాడికి గురైన తెలుగుదేశం పార్టీ బీసీ నేతలను కేంద్ర కార్యాలయంలో కలిసి పరామర్శించారు. వారికి 70లక్షల కార్యకర్తలు అండగా ఉంటారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటమని, వారి అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైందని అన్నారు.
అటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని, దాడి చేసి మన గొంతు నొక్కాలని ప్రయత్నించే వారి నియంతృత్వాన్ని సమాధి చేసే వరకు పోరాటం వీడొడ్డని సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు పర్చూరు అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చి రాంప్రసాద్, తెలుగుదేశం పార్టీ నేతలు బండారు వంశీ, హసన్ భాషా పాల్గొని మద్దతు తెలిపారు.