Suryaa.co.in

Andhra Pradesh

సిగ్గుమానం వదిలి జగన్ పత్రిక తప్పుడు రాతలు రాస్తోంది

-గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమనడం సిగ్గుచేటు
-జలవనరుల శాఖ అధికారులతో సమీక్షలు చేసి ఈ ప్రభుత్వం పీకింది ఏంటి.?
– కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి :- ఈ ప్రభుత్వ అసమర్ధత ఏది బయటపడ్డా దాన్ని చంద్రబాబు, టీడీపీకి అంటగట్టడం జగన్ పార్టీ, ఆయన మీడియాకు అలవాటైపోయింది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడానికి టీడీపీ ప్రభుత్వమే కారణం అంటూ సాక్షి వచ్చిన కథనాన్ని ఖండిస్తున్నా. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణను జగన్ ఎప్పుడో గాలికొదిలేశారు. ప్రాజెక్టుల గేట్లు మరమ్మతులకు నోచుకోవడంలేదని రైతులు, మీడియా గగ్గోలు పెట్టినా జగన్ పట్టించుకోలేదు. గతంలోనే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఒకటి ఊడింది..ఇప్పుడు మరొకటి ఊడింది.

కనీసం గ్రీజ్ కూడా గేట్లకు పెట్టడం లేదు. తిని ప్యాలెస్ పడుకుని బయటకు రాకుండా ఏ ప్రాజెక్టు ఎలా ఉందో చూడకుండా గుడ్డెద్దుబోయి చేలో పడ్డట్టు ఇంకా చంద్రబాబుపై మీ ఏడుపులు ఎందుకు.? క్యూసెక్కుకు, టిఏంసీకు తేడా తెలియని వాళ్ళను నీటిపారుదల మంత్రులను చేస్తే ఇలాంటివే దాపురిస్తాయి. ప్రాజెక్టుల తీరుపై అధికారులతో సమీక్షలు చేసి మీరు పీకింది ఏంటి.? టీ, సమోసాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఒక్క టీఎంసీ నీటిని కాపాడటంపై పెట్టండి. అసలే వర్షాలులేక ప్రాజెక్టులు నిండుకున్నాయి.. ఇప్పుడు జగన్ సోమరిపోతు తనంతో గేట్లు ఊడి నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. గతంలో కూడా పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశాడని సాక్షిలో రాశారు.

కానీ గేటు కొట్టుకుపోవడానికి మాత్రం చంద్రబాబే కారణం అని రాశారు. ఇప్పుడు కూడా 2008లో రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మను పూర్తి చేశారని రాశాడు..కానీ గేటు కొట్టుకుపోవడానికి మాత్రం చంద్రబాబు అని రాశారు. అన్నమయ్య గేటు కొట్టుకుపోయి రెండేళ్లు అయినా సరైన మరమ్మతులు లేవు. తప్పుడు రాతలు రాస్తే ప్రజలు ఉమ్మేస్తారని జగన్ మీడియా గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా గుండ్లకమ్మ ప్రాజెక్టులో మిగిలిన గేట్లకు మరమ్మతులతో పాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టుల నిర్వహణపైనా సీఎం సమీక్షలు చేసి పనులు చేపట్టాలి. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల వద్ద ఆందోళన చేపడతాం.

LEAVE A RESPONSE