– చంద్రబాబు వదిలిన విషపు బాణం షర్మిల
– వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: వైయస్ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక షర్మిల అనే విషపు బాణాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు.
2009లో సోనియాగాంధీ నిబంధనలకు రాజీపడి ఉంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వచ్చేది కాదని గుర్తు చేశారు. 2014లో రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవారమని తెలిసినా అబద్ధపు హామీ ఇవ్వలేనని నిజాయితీగా వ్యవహరించారు కాబట్టే ప్రతిపక్షంలో ఉండి పోయారని తెలిపారు.
అటు కుటుంబంలోనూ, ఇటు రాజకీయంగానూ ఒంటరైన షర్మిల ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పెళ్లైన 25 ఏళ్ల తర్వాత కూడా స్వార్జిత ఆస్తుల్లో, చెల్లికి 40 శాతం ఆస్తిని ఈరోజుల్లో జగన్ కాబట్టే పంచగలిగారని, అందుకు అంగీకరించిన ఆయన సతీమణి భారతమ్మని అభినందించాలన్నారు.
ఆస్తుల మీద మమకారంతో వైఎస్సార్ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేలా తన అన్నకు రాసిన లేఖ లీక్ చేసి మీడియాలో చర్చలు జరగడానికి కారణమైన షర్మిలను వైఎస్సార్ అభిమానులు ఎప్పటికీ క్షమించరని ఆయన స్పష్టం చేశారు. తల్లి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీకి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్న షర్మిల.. ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన తన లేఖ, ఎంవోయూకు సమాధానం చెప్పాలని అన్నారు.
చంద్రబాబు, తన సొంత చెల్లెళ్లకు, తమ్ముడికి ఎన్ని ఆస్తులు పంచాడో ప్రకటన చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలిపిరి దాడి తర్వాత పరామర్శించడానికి వెళ్తే రామ్మూర్తినాయుడును బండ బూతులు తిట్టి అవమానించాడని.. మరో సందర్భంలో తిరుపతి వచ్చినప్పుడు తమ్ముడిని తిట్టిన చంద్రబాబు, తమ్ముడే తనను తిట్టినట్లు తల్లి అమ్మణ్నమ్మకు చెప్పారని తెలిపారు. ఒక విషయమై అరబిందో వారి నుంచి రూ.40 లక్షలు వసూలు చేసిన చంద్రబాబు, ఆ తర్వాత వారికి ముఖం చాటేసిన విషయాన్ని కూడా రామ్మూర్తి నాయుడు చెప్పారని వివరించారు.