Suryaa.co.in

Andhra Pradesh

షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే

మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది
8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు
రెండు మూడు కంపెనీల కోసమే న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు.

రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు.అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు.

ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు.

LEAVE A RESPONSE