– స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు
– ప్రయాస్ నివేదికతో షిర్మిసాయికి తొలి షాక్
– అధికారంలోకి వచ్చినా షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌పై చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీలో అసంతృప్తి
– ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోకపోవడంపై పెదవి విరుపు
– ఇటీవల ఉన్నతహోదా పొందిన అధికారి రాయబారం చేశారన్న విమర్శలు
– జగన్ జమనాలోనూ అంటకాగిన అధికారి రాయబారంతోనే చర్యలు నిలిచిపోయాయన్న అసంతృప్తి
– ఆ విమర్శలు తొలగించుకునేందుకు సిద్ధమవుతున్న కూటమి సర్కారు
అధికారంలోకి వచ్చి ఏడునెలలువుతున్నప్పటికీ.. జగన్ జమానాలో ఒక వెలుగు వెలిగిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అక్రమాలకు సంబంధించి.. కూటమి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోని వైనంపై అసంతృప్తితో ఉన్న టీటీడీ శ్రేణులను మెప్పించే నిర్ణయం తీసుకునేందుకు, సర్కారు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆ కంపెనీకి ఇచ్చిన వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలని, సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచార ం. ప్రయాస్ అనే ఇంధన పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్కారు చర్యల కొరడా ఝళిపించనుంది.
జగన్ జమానాలో చెలరేగిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ జగన్-అవినాష్‌రెడ్డి బినామీ సంస్థ అని, టీడీపీ విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసింది. తాము అధికారంలో వచ్చిన తర్వాత దానిపై విజిలెన్స్ విచారణ జరిపి, భూములను స్వాధీనం చేసుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా, షిర్డిసాయి అక్రమాలపై ఆరోపణలు గుప్పించారు. నాటి సర్కారు చేసిన కేటాయించిన భూములను రద్దు చేయాలమని కోరుతూ.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోర్టులో కేసు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడునెలలవుతున్నప్పటికీ, షిర్డిసాయి అక్రమాలపై విచారణ జరపకపోవడం, దానికి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోకపోవడంపై టీడీపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఈ విషయంలో ఇటీవలే ‘ఉన్నతపదవి’ పొందిన ఐఏఎస్ చక్రం తిప్పి.. షిర్డిసాయి కంపెనీతో రాయబారం నిర్వహించినందుకే, ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న చర్చ అటు సోషల్‌మీడియాలో కూడా జరిగిన విషయం తెలిసిందే.
అసలు సదరు అధికారికి ఉన్నత పదవి దక్కడం వెనక.. ఆ సంస్థతోపాటు అదానీ కూడా చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జోరుగా జరిగ్ని విషయం తెలిసిందే. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలక ప్రభుత్వంలోని పెద్దల ‘అవసరాలు తీర్చి’ బతుకు-బతికించు సిద్ధాంతంతో వారిని మెప్పించడ ంలో నిష్ణాతుడనే పేరున్నందుకే, ఆయన రికార్డు స్థాయిలో అదే శాఖలో కొనసాగారన్న వ్యాఖ్యలు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ నాటి అక్రమాలపై చర్యలు ఏవంటూ.. అటు మీడియాలోనూ పుంఖానుపుంఖాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దిద్దుబాకు దిగిన సర్కారు, ప్రయాస్ అదే ఇంధన పరిశోధన సంస్థను నియమించింది. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. షిర్డిసాయి కంపెనీకి ఇచ్చిన స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ప్రక్రియ అసంబద్ధమని తేల్చింది. దానితో కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని సిఫారసు చేసినట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కూటమి సర్కార్ మొదటిషాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయనుంది. అదంతా వృథా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పనులను రద్దుచేయనుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్‌రంగాన్ని శాసించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు ఇది శరాఘాతమే! రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18లక్షల 58వేల వ్యవరాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 2 శాతం అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నా అస్మదీయ సంస్థ షిర్డీసాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50వేల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లపై ముందుకు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు, అనుబంధ పరికరాల కోసం జగన్ ప్రభుత్వం తొలిసారి 2020లో రూ.6,480 కోట్ల ప్రతిపాదనలతో టెండర్లు పిలిచింది. ఈ ధరలపై ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్దుచేసింది. రెండోసారి అనుబంధ పరికరాలు, స్మార్ట్‌మీటర్లు, నిర్వహణ పనులుగా విడగొట్టి వేర్వేరుగా టెండర్లు పిలిచింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్కో కనెక్షన్‌కు సుమారు 35వేల చొప్పున ధరలను నిర్ణయించింది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేదానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. రైతులు, రైతు సంఘాల వ్యతిరేకతనూ పట్టించుకోలేదు. చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైందంటూ YCP ప్రభుత్వం ప్రకటించింది.
ఐతే ఈ మాటల్లో నిజంలేదని, పైగా ప్రజాధనం వృథా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్‌తో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంలో తేల్చింది. పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్‌కు అవకాశం ఉందని నివేదించింది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం, నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పినా భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపింది. స్మార్ట్‌మీటర్లకు పెట్టే రూ.6,500 కోట్లను ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని గత ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది.