– తెలంగాణ సీఎం వ్యాఖ్యలు కూటమి సమర్ధిస్తుందా?
– రేవంత్ రెడ్డి మాటలను ప్రభుత్వం సమర్థించింది
– కేశవ్ కూడా రేవంత్ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు
– వైష్టవి డెయిరీ, సంగం డెయిరీలు వేర్వేరు కాదని తేలిపోయింది
– అవే ట్యాంకర్లు వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ ఎలా టీటీడీ లోకి ప్రవేశించాయి?
– ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఎందుకు వాడారు?
– లఘు చర్చలో స్టేట్మెంట్ అంటూ కొత్త సాంప్రదాయం
– చర్చ జరగకుండా కూటమి సభ్యులు ఛైర్మన్ పోడియం చుట్టుముట్టారు
– బీఏసీలో చర్చకు అంగీకరించి సభలో ఛైర్మన్‌తో అమర్యాదగా వ్యవహరించారు
– మండలి సమావేశాల చరిత్రలో ఇది చీకటి రోజు
– ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తించింది
– టీటీడీ నిధులు దోపీడీపై మా వద్ద ఆధారాలున్నాయి
– వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తామనే కూటమిలో భయం
– సమావేశాల ఆఖరి రోజు వరకు లడ్డూపై చర్చకు పట్టుబడతాం
– కూటమి తీరుపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం
వెలగపూడి: ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్, కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. సభలో మాత్రం సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించిందని, మంత్రి పయ్యావుల కేశవ్ అనుచితంగా వ్యవహరించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైీసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కుంభా రవిబాబు, మొండితోక అరుణ్‌కుమార్, పర్వతరెడ్డి చంద్రవేఖర్రెడ్డి, పాలవలస విక్రాంత్, బొర్రా గోపిమూర్తితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
బొత్స ఏమన్నారంటే..రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అసలీ ప్రాజెక్టు ఎందుకు ఆగింది? తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమా కాదా? అని మండలిలో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా పిట్టకథలతో డైవర్ట్ చేయాలని చూశారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాధారం లాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేశారు. కీలకమైన ప్రాజెక్టు గురించి సమాధానం చెప్పే సత్తా లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ ప్రభుత్వం ఖండించలేకపోతోంది.
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రేవంత్ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారని వెల్లడించారు. వారి సన్నిహిత సంబంధాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.
‘మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పం. మాకు నచ్చిన వాటి గురించి మాట్లాడతాం’ అనే విధంగా వ్యవహరించారు. నేరుగా సమాధానం చెప్పలేక మధ్యలో హరీశ్‌రావు పేరును, బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ ఏం వ్యాఖ్యలు చేసి ఉన్నా వాటిని వైయస్సార్సీపీ ఖండిస్తోంది. కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా రేవంత్ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారు. వారి సన్నిహిత సంబంధాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారు.
వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఇందాపూర్ ముసుగులో చంద్రబాబు కుటుంబ సంస్థ హరిటేజ్ చేసిన అవినీతి గురించి చర్చ జరగడం ఇష్టం లేకనే అడుగడుగునా ఆటకం కల్పించడంతోపాటు, సభా నియమాలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు.
పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు తప్పించుకుని ఉండొచ్చుగాక, కానీ వారు చేసిన అపచారాలకు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. మేము మాత్రం ఆ అంశాలపై చర్చ విషయంలో వెనుకంజ వేయబోము. సమావేశాల చివరి రోజు వరకు కల్తీ నెయ్యి, ఇందాపూర్–హెరిటేజ్ సంబంధాలపై చర్చకు పట్టుబడుతూనే ఉంటాం. కాగా, మీడియా పబ్లిసిటీ కోసం సభా మర్యాదలు, వ్యక్తుల గౌరవాన్ని కించపరచడం ఏ మాత్రం తగదు.
దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సీబీఐ సిట్ ఛార్జిషీట్ సాక్షిగా తేలిపోయింది. బీఏసీ సమావేశంలో అన్నింటికీ అంగీకరించి మా సభ్యులు మాట్లాడటానికి చైర్మన్ అవకాశం కల్పిస్తే, క్వశ్చన్ అవర్ ముందు పెట్టాలని కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఆ తర్వాత స్టేట్ మెంట్ ఇస్తామని చర్చ ప్రారంభం కాకుండానే ముగించారు.
షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఛైర్మన్‌కు కూడా తెలియకుండా సభను హైజాక్ చేసే ప్రయత్నం చేశారు. మండలిని టీడీపీ కార్యాలయం అనుకుంటున్నారేమో!. చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం చర్చ జరపకుండానే ముగించింది. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకి వచ్చి గొడవ పెట్టి సభను వాయిదా వేయించడం ఎప్పుడూ జరగలేదు. చర్చకు భయపడి చైర్మన్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా వైయస్సార్సీపీ వాకౌట్ చేసిందని అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఎన్నాళ్లయినా కల్తీ నెయ్యిపై చర్చకు వైయస్సార్సీపీ పట్టుబడుతూనే ఉంటుంది.
ఇందాపూర్ డెయిరీ అనేది చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విషయం వారి వెబ్సైట్లోనే రాసుకున్నారు. ఇదే ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో కేజీ నెయ్యి రూ.560లకు విక్రయిస్తూ టీటీడీకి మాత్రం రూ.658లకు సప్లై చేయడం అవినీతి కాదా? వైష్టవి డెయిరీ, సంగం డెయిరీలు వేర్వేరు కాదని తేలిపోయింది. ఏఆర్ డెయిరీ పంపిన నెయ్యి ట్యాంకర్లను కల్తీ అని టీటీడీ తిరస్కరించి పంపితే, అవే ట్యాంకర్లు వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ ఎలా టీటీడీ లోకి ప్రవేశించాయి? ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఎందుకు వాడారు? ఇది కూటమి ప్రభుత్వంలోనే కదా జరిగింది? వాటన్నింటిపై చర్చకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం పారిపోయింది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమి వచ్చాక, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలయాల్లో వరుసగా దుర్ఘటనలు జరిగి ఎంతోమంది అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుమతి, సింహాచలం, కాశీబుగ్గ, కోటప్పకొండ ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలే ఉదాహరణలు. శ్రీశైలం ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు అలమటించిపోయారు. ఆలయంలో భక్తులపై లాఠీచార్జి చేయడం ఏంటి? ఎప్పుడూ చూడని దారుణాలు కూటమి పాలనలోనే జరుగుతున్నాయి.
గతంలోనూ పుష్కరాల పేరుతో ఆలయాలను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చికి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగినా దుర్ఘటనలే. ప్రభుత్వం చేసిన హత్యలుగానే చూడాలి. కానీ ఏ దుర్ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు..