– మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి
మంగళగిరి: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడాల్సి వస్తుందని మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు.ఓటరు స్లిప్పులను లాక్కొని.వేరే గ్రామాల్లోని వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఇది చాలా ప్రమాదకరమని అన్నారు.
చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ చేసిన పని వల్ల రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు తెరలేపారు.
చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదని అన్నారు. ఇది సరియైన పద్ధతి కాదు. టీడీపీ, పోలీసులు, ఎన్నికల కమిషన్ కలిసిపోతే ఇక ఏం చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చేసే దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు మీకు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.