-ఎస్‌ఐ పరీక్షా కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.
తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ మెయిన్స్ పరీక్షలు జరిగిన పరీక్షా కేంద్రాలను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సందర్శించారు.
సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ లో ఉన్న కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతిభ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్ లో ఉన్న పాపయ్యయాదవ్ నగర్ కాలనీలోని రెయిన్ బో గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ అండ్ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ లలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., బాలానగర్ డిసిపి టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తదితరులతో కలిసి సందర్శించి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈరోజు రేపు నిర్వహించనున్న సబ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్ష కోసం సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ యంత్రాంగం మరియు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 24 కేంద్రాల్లో, దాదాపు 19,973 వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని కేంద్రాల వద్ద తగిన బందోబస్త్ ఏర్పాట్లు చేశారన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగిందని పరీక్షలు జరిగే సమయంలో నలుగురు కానీ అంతకంటే ఎక్కువ మంది గానీ గుమికూడవద్దని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని సిబ్బందికి సూచించారు. సిపి వెంట డీసీపీ బాలానగర్ టి శ్రీనివాసరావు, ఐపీఎస్., మేడ్చల్ డిసిపి ట్రాఫిక్ డివి శ్రీనివాసరావు, ఐపీఎస్., కూకట్పల్లి ఏసిపి ఏ చంద్రశేఖర్, కూకట్పల్లి ట్రాఫిక్ ఏసిపి ఏ ధనలక్ష్మి, కూకట్పల్లి ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, కూకట్పల్లి ట్రాఫిక్ సిఐ నగేష్ తదితరులు ఉన్నారు.