శ్రీకాకుళం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును సిక్కోలు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు బుధవారం సచివాలయంలో కలుసుకున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సహకారంతో సీఎం చంద్రబాబును సిక్కోలు మహిళా నాయకులు కలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిని, పార్టీలో వారు చేసిన కృషి గురించి చంద్రబాబుకు వివరించారు. ఆయన మహిళా నాయకులతో మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో కష్టపడి పని చేసే వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. నిజాయితీతో పనిచేసే వారికి పదవులు తప్పక వరిస్తుందని చెప్పారు. దీంతో మహిళా నాయకులంతా ఆనందం వ్యక్తం చేశారు.