– మంత్రి నారా లోకేష్
అమరావతి: అధికారులతో యుద్ధ ప్రాతిపదికన జిఓ 225 విడుదల చేయించడంతో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన 25మంది దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఉండవల్లి నివాసానికి వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరినీ అభినందించాను. వారికి ల్యాప్ ట్యాప్‌లను బహుకరించాను. సింపుల్ గవర్నమెంట్ – ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే మా లక్ష్యం అని వివరించాను.