నేనేదో బెయిల్ రద్దు అవుతుంది అనుకున్నా. ఫ్యామిలీ ప్యాకేజ్ అని ఊహించలేదు!
ఆ రోజు.. తెల్లవారుజామున లోటస్ పాండ్ రమ్మనాడు ఆనందాన్ని దాచుకుంటూ.. జగన్. ఎప్పుడూ రమ్మని చెప్పని ఆ సమయంలో ఆలోచనలు పంచుకోవడానికి రాత్రంతా నిద్రపోలేదు ఆహ్వానితులు. తెల్లారాక ప్రజలకు చెప్పబోయే గుండెపోటు గురించి వారికి తెలియదు.
వచ్చారు. సమావేశం మొదలైంది హుషారుగా.. ఎన్నికల ప్రచారం గురించి చర్చ చేస్తున్నారు.
గడియారం ముల్లు ఆ ఉదయంలో ఐదు చూపిస్తున్నాయి. మేడం మేడమీదికి పిలిచారు అని జగనుకు వచ్చిన సందేశంతో ఆశ్చర్యపోతూ.. చిలిపిగా తెలుగు సినిమాలలో లెక్కన ఏమి ఊహించుకున్నారో ఆ గదిలో. కానీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ గడియారం వైపు చూశాడు.
కాసేపటికే అక్కడికి వచ్చిన జగన్.. తనలోని నటుడిని బయటకు తెచ్చి “చిన్నాయన వివేకా ఇక మనకు లేరు” అని ఏడుపు గొంతుతో చెప్పేసరికి, రాత్రంతా ఆలోచించుకొని వచ్చిన వారిలో నిరుత్సాహం, కానీ ఈ ఎన్నికల సమయంలో ఇదో శుభవార్త అన్నట్లు వెళ్లిపోయారు.
తెల్లారింది. ఆలోపు మేడ మీద ఏ మంతనాలు జరిగాయో!
పొద్దున్న కోట్లాది జనానికి చెవుల్లో పువ్వులు పెడుతూ గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడు అని సాక్షి స్క్రోలింగ్ ద్వారా ప్రచారం మొదలెట్టారు. కొంచెం పొద్దెక్కాక, విజయసాయిరెడ్డి ప్రక్కన చెవిరెడ్డిని పెట్టి అధికారికంగా గుండెపోటు అని ప్రకటించింది వైకాపా.
దానిని నారాసుర చరిత్రగా మార్చి అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ సీబీఐ దర్యాప్తు జరుగుతుంటే.. ఆ మర్డర్ జరిగిన సమయంలో భారతి పీఏ ఫోను ద్వారా ఏమని మాట్లాడారు అంటే.. తలకాయ కూర గురించి అని వ్యంగ్యంగా సమాధానం వచ్చింది అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
సూర్యోదయం తరువాత, ఆరు గంటల తర్వాత వివేకా ఇంటి దగ్గర మర్డర్ స్పాట్లో ఇంటి పెరట్లో నుండి లోనికి ప్రవేశించడంతో మొదలైన జగన్ దంపతుల స్కిట్ స్క్రిప్ట్ ప్రకారం యాక్షన్, డ్రామా, ప్రచారం మొదలైంది.
కానీ.. వివేకా మీద అభిమానంతో వచ్చిన వారిని అవినాశ్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో అనుమానం మొదలైంది!
డాక్టర్ సునీత కన్న తండ్రి మరణం మీద అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పడంతో కర్మ మొదలైంది.
లేదంటే కుట్లేయడం నుండి సాక్షులు మొదలు కుట్లేసిన సొంత మామ గంగిరెడ్డి, మరో బాబాయ్ అబ్బాయ్ డాక్టర్ గాయాలు ఉన్నా కుట్లేసి తరువాత పైకి పోయారు. ఆ రోజు ఆ ‘ గుండెపోటు’ గురించి అస్సలు తెలియకుండా.. అప్పటికే తెచ్చిపెట్టిన శవపేటికలో పెట్టి సమాధి చేసేవారు.
సునీతను కూడా కోర్టుకు పంపి ఎన్నికల్లో ఈ హత్యను ప్రచారానికి వాడుకోకూడదు అని తీర్పు తెప్పించిన ఈ కిరాతకుల పాపం పండింది. సత్యమేవ జయతే అని వివేకానంద కేసులో కూడా నిజాలు వస్తాయి. ఆయన వారసురాలు వదలదు.
స్క్రోలింగులు: వివేకానంద రెడ్డి హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్ పై కోర్టు కీలక తీర్పు – వివేకా కుమార్తె సునీత పిటిషన్ ను షరతులతో అనుమతించిన న్యాయస్థానం -వివేకా హత్య కేసు తదుపరి దర్యాప్తు చేయాలని సిబిఐకి ఆదేశం – సునీత వాదనలతో ఏకీభవించిన సిబిఐ న్యాయస్థానం.
– చాకిరేవు