కేజీకి రూ.25/- కమిషన్ కోసం భక్తులకు 60.37 లక్షల కిలోల కల్తీ నెయ్యి ప్రసాదాలు!
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వెలసిన కలియుగ వైకుంఠాన్ని, కల్తీ నెయ్యితో కలుషితం చేసిన వ్యవస్థలో జగన్ బాబాయి వైవీ సుబ్బా రెడ్డి అడ్డంగా దొరికాడు.
టీటీడీ పాలక చైర్మన్‌గా ఈయన పేరును ప్రకటించినప్పుడే, ఈయన రాకను హిందూ భక్తులు వ్యతిరేకించారు. ఆ హడావుడిలో వికీపీడియాలో ఈయన మతాన్ని హిందువుగా మార్చి, ఎన్నో సార్లు అయ్యప్ప మాల వేసుకొన్న మహా హిందూ భక్తుడు అని ఆ నిరసనల మీద నీరు చల్లారు.
వై.వి. సుబ్బా రెడ్డి, 2019–2023 మధ్య టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 25.05.2022న, పోమిల్ జైన్ (ఎ3), కైలాష్ చంద్ మాంగ్లా, పీ.పి. శ్రీనివాసన్
టీటీడీ చైర్మన్‌గా వున్న సుబ్బా రెడ్డి ని హైదరాబాద్‌లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారట. ఆ సమావేశంలో, ప్రతి కిలో నెయ్యికి ఆయన పీఏ కడురు చినప్పన్న రూ. 25/- లంచం డిమాండ్ చేశాడట. అందుకు అంగీకరించి, తమ ఫ్యాక్టరీపై తనిఖీ చేయవద్దని జైన్ అభ్యర్థించాడట.
చైర్మన్ పీఏ కడురు చినప్పన్న, టీటీడీకి నెయ్యి సరఫరాదారు అయిన ప్రీమియర్ అగ్రి పుడ్స్ ప్రతినిధి మరియు హవాలా ఏజెంట్‌గా చెప్పబడుతున్న అమన్ గుప్తా నుంచి న్యూఢిల్లీ పటేల్ నగర్ మెట్రో సమీపంలో సుమారు రూ.20 లక్షలు స్వీకరించాడు. అదేవిధంగా ప్రీమియర్ అగ్రి పుడ్స్ మేనేజర్ విజయ్ గుప్తా నుండి సుమారు రూ.30 లక్షలు న్యూఢిల్లీలోనే పలు సందర్భాల్లో స్వీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
16.05.2022న భోలే బాబా ఆర్గానిక్ డైరీపై వచ్చిన అజ్ఞాత ఫిర్యాదును, టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు విచారణ కోసం అప్పగించారు, వైవీ సుబ్బారెడ్డి.
ఆపై, 20.05.2022న, చైర్మన్ ఆదేశాల మేరకు, మూడు కంపెనీల (ప్రీమియర్ ఆగ్రో, వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీ) నెయ్యి శాంపిల్స్ టిన్ల నుండి సేకరించి సెంట్రల్ పుడ్ టెక్నలాజికల్ రీసర్చ్ ఇనిస్ట్యూట్ (CFTRI) ల్యాబ్, మైసూరుకి పంపారు. CFTRI నివేదిక (ఆగస్టు 2022)లో అన్ని శాంపిల్స్ వెజిటబుల్ ఆయిల్ కల్తీతో ఉన్నట్లు ధృవీకరించింది. అయినప్పటికీ ఏ చర్య తీసుకోకుండా, ఆ కంపెనీలకు 2024 వరకు సరఫరా కొనసాగించేందుకు అనుమతించారు.
పాలు సేకరించకుండానే, ఉత్తరాఖండ్‌లోని భగవాన్‌పూర్ ప్లాంట్‌లో పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, పమోలిన్ వంటి చవకైనవి ఉపయోగించి, కొద్ది మొత్తంలో నెయ్యిని కలిపి తయారు చేశారు. ల్యాబ్ పరీక్షల విలువలు సాధారణంగా కనిపించేలా మరియు వాసన కూడా ఉండేలా ప్రమాదకరమైన బీటా-కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, నెయ్యి ఫ్లేవర్ వంటి విషతుల్యమైన కెమికల్స్ కలిపారట.
2019-2024 మధ్య సుమారు 60,37,351 కిలోల (60.37 లక్షల కిలోలు) కల్తీ నెయ్యిని నాలుగు ప్రధాన సంస్థల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీని మొత్తం విలువ ₹240 కోట్లకు పైగా ఉంది.
ఓం నమోవెంకటేశాయ అని వినిపిస్తుంటే మైమరిచి వుండే భక్తుల ఆ వైకుంఠంలో.. తిన్న ఈ కమీషన్లు అరగక, జగన్ మోహన్ రక్షకా గోవిందా అని పత్ని హేళనగా పెట్టిన పెడబొబ్బలు ప్రతిధ్వనించాయి. కోట్లాది భక్తులకు కోపం వచ్చింది. కార్యాలయంలో కూడా టీషర్టు, లుంగీతో తిరిగే అధికారి ధర్మాన.. ఆ అధర్మ పాపాలకు వత్తాసు పలికాడు. పాపం పండి కొడుకు పోయినా.. వారి పాపాలు ఆగలేదు. పాపాత్మ మంద అధికారం కూడా పోవడంతో.. ఆ పాపాల పుట్టలు ఇప్పుడు పగులుతున్నాయి.
వైవీ సుబ్బారెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు సుప్రీంకోర్టు నియమించిన సిట్ అడిగితే ఇవ్వలేదు. బ్యాంక్ స్టేట్మెంట్ సిట్‌కు ఇచ్చేందుకు భయపడి, ఈ దంపతులు ఆఘమేఘాల మీద కోర్టును ఆశ్రయించి వ్యక్తిగత గోప్యం క్రింద నిలువరించారు.
కొండమీద ఈ పాపాత్ము లు కొలువు తీర్చి, ధర్మం మీద దాడి చేసి, కమీషన్లు కూడా దండుకొని, కల్తీ నెయ్యి ప్రసాదాలను ఇచ్చిన ఆ పాపపు ఐదేళ్లను ప్రజలు, భక్తులు అసహ్యించుకుంటున్నారు.
– చాకిరేవు