– ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు తెలంగాణకు తరలింపు
– టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ మరియు జూరాల నుండి రోజుకు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతా ఉంది. అదేవిధంగా తుంగభద్ర మరియు సుంకేసుల నుండి కూడా రోజుకు 1 లక్ష 60 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతావుంది. మొత్తంగా చూస్తే శ్రీశైలం ప్రాజెక్టుకు రోజుకు దాదాపు 3 లక్షల 50 వేల క్యూసెక్కుల వరద నీరు చేరతావుంది.
ఈరోజు శ్రీశైలం యొక్క నీటి నీటిమట్టం చూస్తే 866 కాగా 126 టిఎంసిల నీరు నిల్వ ఉంది. తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా మూడు టీఎంసీల వరద నీటిని పవర్ జనరేషన్ కొరకు దొంగగా వాడుతున్నారు. అలాగే మహాత్మా గాంధీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి మరియు కృష్ణ నీటిని కలుపుకుని 1600 క్యూసెక్కుల నీటిని లిఫ్టింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతోంది. కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళుగప్పి మందబలంతో, అహంకారంతో ఆంధ్రుల హక్కులను కాలరాస్తూ దౌర్జన్యంగా వరద నీటిని తెలంగాణకు తరలించుకునిపోతున్నాడు.
ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడు. మన రాష్ట్రానికి పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తడం ద్వారా గాని, మల్లెల లిఫ్ట్ ఆడించడం ద్వారా గాని, మచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గాని కనీసం కృష్ణ నీటిని గాని రాయలసీమ ప్రాంతానికి తరలించలేకపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర పోతున్నాడు, మనం పూర్తిగా హక్కులు కలిగి ఉన్న వరద నీరు తెలంగాణకు తరలిపోతున్నా ఆయనలో చలనం లేదు.
అసలు ఇరిగేషన్ మంత్రి ఎవరో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. కనీసం అధికారులు కూడా పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాశి వరద నీటిని తరలించుకుని పోతుంటే నోరు మెదపరెందుకు. ఎందుకు వీరందరూ మాట్లాడలేకపోతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మిగుల జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదే పూర్తి హక్కు. మరి పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఆ జలాలను తరలించుకుపోతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు.
ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే, సత్వరమే ప్రతిఘటించకపోతే శ్రీశైలం ప్రాజెక్టు ను పూర్తిగా ఖాళీ చేసేస్తారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కెసిఆర్ దౌర్జన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఎండగట్టాలని, ఈ దౌర్జన్య కాండను ఆపాలని తెలుగు రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.