Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులపై కక్షతోనే ఏసీబీ యాప్‌

– ఎమ్మెల్యేల పేకాటక్లబ్‌ యాప్‌ కూడా పెడతారేమో?
– టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా దొంగ దొంగ దొంగ అని అరిచినట్లు గా… అవినీతికి రారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ నేడు అగ్రస్థానంలో ఉంది అంటే ఆ ఘనత మాత్రం ఒక జగన్ మోహన్ రెడ్డి దే. ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ రోజు గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే పట్టుకోడానికి ఒక యాప్ ను ప్రవేశపెట్టాడు. మరి తన ఎమ్మెల్యేలు, తన క్యాబినెట్ మంత్రులు చేసే అవినీతిని పట్టుకోడానికి ఏ ఆప్ ఉందో చెప్పాలి. ఇసుక నుంచి మొదలుకొని మట్టి, మైనింగ్ , మద్యం ల్యాండ్ మాఫియా నందు వైసిపి చేసే అవినీతిని పట్టుకోడానికి ఏ యాప్ ఉంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నాం. నీ ఎమ్మెల్యేల చేత పేకాట క్లబ్ లు పెట్టిస్తున్నావ్… జగన్మోహన్ రెడ్డి త్వరలో దీనికి కూడా యాప్ ను ప్రవేశపెడతాడు అనటంలో అతిశయోక్తి లేదు…

సిపిఎస్ రద్దు డిమాండ్ తో తాడేపల్లి లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారనే కక్షతోనే ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఈ యాప్ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు వారికి ఇస్తే అవినీతికి పాల్పడిన కర్మ ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఉండదు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తానని దొంగ హామీ ఇచ్చి మోసం చేసింది నువ్వు కాదా ? ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు అయిన ప్రభుత్వ ఉద్యోగులు అయిన తనను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి కి వెన్నతో పెట్టిన విద్య.

ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు కొరకు ఉద్యమం చేశారనే కక్ష్య తోనే, ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు బనాయించడానికే ఈ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగిందని స్పష్టం గా తెలుస్తోంది.

నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రం గా చేయాలని జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇసుక, మట్టి, మైనింగ్, మద్యం మరియు ల్యాండ్ మాఫియా లో జరిగే అవినీతిని అరికట్టేలా తన ఎమ్మెల్యేలు మంత్రులు చేసే అవినీతి ని సైతం ఫిర్యాదు చేసే యాప్ ను మరొకటి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజాధనంతో ఇలాంటి ఎన్ని యాప్ ప్రవేశపెట్టినా ఉపయోగం లేదు. ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నాం దిశా ఆప్ ప్రవేశపెట్టారు. ఈ దిశ యాప్ ద్వారా ఫోన్ చేసిన గంటకు గాని పోలీసులు స్పందించే దాఖలాలు లేవు… అయినా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక్కొక్క ఆప్ పెట్టు కుంటూ పోతే ఒక ఫోన్లో ఎన్ని యాప్ లు అని డౌన్లోడ్ చేసుకోవాలి ? ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ప్రశ్నించడానికి టిడిపి ఎప్పుడూ ముందు ఉంటుంది.

LEAVE A RESPONSE