తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తూ, విద్యార్థి,నిరుద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు ముందుండి ఉద్యమాలు చేస్తున్న సింకారు శివాజి ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే.
తెలంగాణలో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని భుజం తట్టి ప్రోత్సహించారు. తెలంగాణలో శివసేన పార్టీ యువసేన అధ్యక్ష్యుడిగా (యువజన విభాగం అధ్యక్షుడిగా) పోరాటం చేసిన సింకారు శివాజీని పార్టీ గుర్తించి తెలంగాణ శివసేన రాష్ట్ర అధ్యక్ష్యుడి బాధ్యతలను ఇస్తున్నట్లు శివసేన జాతీయ పార్టీ కార్యాలయం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
సింకారు శివాజీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ ఇంటికి (అధికార నివాసం వర్ష) పిలిపించుచుని స్వయాన ఆయన చేతులమీదుగా నియామక పత్రం అందజేయడం జరిగింది.