November 10, 2026

అనుబంధాలకు భగినీ హస్త భోజనం

భగినీ హస్త భోజనం అనేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అప్యాయతానురాగాలకు, పవిత్రమైన బంధానికి ప్రతీకగా జరుపుకునే గొప్ప సంప్రదాయ పండుగ.భగినీ హస్త భోజనం అంటే సోదరి (అక్క లేదా చెల్లెలు) చేతితో వండి వడ్డించిన భోజనాన్ని సోదరుడు స్వీకరించడం అని అర్థం.

  • భగినీ అంటే సోదరి (అక్క/చెల్లెలు).
  • హస్త అంటే చేయి.

భోజనం అంటే ఆహారం స్వీకరించడం. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాతోపాటు ఈ ఆచారం ఇప్పటికీ చాలాచోట్ల కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు. నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు. పంజాబ్ ప్రాంతంలో ఈ పండుగను ‘టిక్కా అని పిలుస్తారు.కార్తికమాసం అనగానే చన్నీటి స్నానాలు, శివాలయాల్లో అభిషేకాలు, ఉపవాసాలు కనిపిస్తాయి. ఏనోటవిన్నా, ఏ గుండె సవ్వడి విన్నా పంచాక్షరీ మంత్రమే వినిపిస్తుంది. భక్తుల హృదయాల్లో కార్తికమాసం అంతగా పెనవేసుకుపోయింది. అందుకే కార్తికమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆధ్యాత్మికత నిండిన కార్తికమాసంలో అను బంధాలను కూడా పరిపుష్టం చేసేందుకు కొన్ని నియమాలను విధించాయి. ఒకే కడుపున పుట్టిన బిడ్డల మధ్య ఉండే సహజ జన్మబంధాన్ని జన్మజన్మల బంధంగా తీర్చిదిద్దేందుకు పునాదిగా అవసరమైన హృదయబంధాల్ని కూడా ఈ మాసం బలపరుస్తుంది. ఈ క్రమం లో ఏర్పడిన ఆచారమే ‘భగినీహస్త భోజనం’.

సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ పురాణగాథ వ్యాప్తిలో ఉంది.
సూర్యభగవానుడికి సంధ్యాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యముడికి కూడా అంతే. యమునకు వివాహం జరిగింది. అత్త వారింటికి కాపురానికి వెళ్ళింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమున కు మాట ఇచ్చాడు.

అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది. యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తికం దిద్ది, పూలమాల వేసి తాను వండిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.

ఏటా ఇదే రోజు… అంటే కార్తిక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావానీ, అలాగే ప్రతి సోదరుడు ఈ రోజున తన సోదరి చేతివంటతో భోజనం చెయ్యానీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని అనుగ్రహించాడు. దీంతోపాటుగా ఎవరైతే కార్తిక శుద్ధ విదియ రోజున సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వారికి నరలోకప్రాప్తి కాని, అపమృత్యుభయం కానీ ఉండదని కూడా వరం ప్రసాదించాడు.

నాటి నుంచి కార్తిక శుద్ద విదియ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాని శాస్త్ర నియమం విధించింది. క్రమంగా ఇదే ‘భగినీ హస్తభోజనం’ పేరుతో ఆచారంగా స్థిరపడిరది.భగినీ హస్త భోజనం కేవలం భోజనానికి సంబంధించిన ఆచారం కాదు.

కుటుంబ బంధాలకు, ఆత్మీయతకు ప్రాధాన్యతనిచ్చే సంప్రదాయం. వివిధ కారణాలతో దూరంగా ఉంటున్న సోదరులు, సోదరీమణులు ఈ పండుగ సందర్భంగా కలుసుకుని తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు. అందుకే ఈ పండుగకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది.

  • ములుకుట్ల సువర్చల
Total Visitors: 3,329,063