Suryaa.co.in

Telangana

ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి

-అరవై ఏండ్లలో అగమైన వారికి ఊరట
-పొడు భూముల పట్టదారులకు రైతుబందు
-పట్టాలు అందుకున్న మరుక్షణం నుండే ఖాతాలలో జమ
-అడగకపోయినా ఆశించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు
-తాండలను గ్రామపంచాయతీలుగా మార్పువిప్లవాత్మకమైన చర్య
-తద్వారా తాండలలో వెలుగులు
-పరిపాలనలో అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్
-మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి బోనగిరి జిల్లాలో పొడు భూముల పట్టాల పంపిణీ
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,పాల్గొన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్ది,ఇంచార్జ్ కలెక్టర్ దీపక్ తివారీ,జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ రాజేశ్ చంద్ర, ఎస్ టి వెలిఫెర్ ఆఫీసర్ నాగిరెడ్డి, డి ఎఫ్ ఓ పద్మజ,ఆర్ డి ఓ భూపాల్ రెడ్డి తదితరులు

ఆరు ఏండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో కనీస అవసరాలు సురక్షితమైన మంచినీరు,పర్యావరణ పరిశుభ్రత,రవాణా సౌకర్యం, విద్య,వైద్య వంటి ప్రాథమిక అవసరాలు తీర్చలేక పోయారని ఆయన పేర్కొన్నారు.పైగా అన్నింటికి మించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాటి పాలకులు ఫ్లోరోసిస్ పాపాన్ని పెంచి పోషించారని ఆయన ఆరోపించారు.అటువంటి శాపం నుండి విముక్తి కుడా ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మటుమాయం చేశారన్నారు.

సోమవారం ఉదయం యాదాద్రిభోనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన భూమి పుత్రులకు ఆయన పొడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.జిల్లాలోని చౌటుప్పల్, తుర్కపల్లి, నారాయణపురం మండలాలోని తొమ్మిది గ్రామాలకు చెందిన 205 మంది లబ్ధిదారులకు 213 ఎకరాల భూమికి ఆయన పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనులు, గోండులు, అడవిబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు.

పొడు భూముల పట్టాలు అందుకున్న గిరిజన రైతాంగానికి తక్షణమే రైతు బంధు పధకం అమలులోకి వస్తుందని ఆయన ప్రకటించారు.పాలనలో అద్భుతాలు సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతారని ఆయన కొనియాడారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. తద్వారా తండాలలో వెలుగులు విరజిమ్ముతున్నాయన్నారు.

2001 నాటి పరిస్థితులను అధ్యయనం చేసిన మీదట ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర సాధన ఉద్యమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. సాధించిన రాష్ట్రాన్ని ఈన గాసి కుక్కల పాలు చెయ్యకుండా ప్రజాదివేనల్తో అధికారంలోకి వచ్చి సంక్షేమాన్ని,అభివృద్ధి ని పరుగులు పెట్టించారన్నారు.

అధికారంలోకి వచ్చిందే తడవుగా నిరంతర విద్యుత్ సరఫరా, సాగునీరు,త్రాగునీరు,కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్, కేసీఆర్ కిట్ లతో పాటు లక్షకోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి చరిత్ర సృష్టించిన నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతి కెక్కారన్నారు.

LEAVE A RESPONSE