ఓ వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన రాత పూర్వక ఫిర్యాదుతో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం బయటపడింది: సీఎం జగన్
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో భాగంగా చంద్రబాబు ఆయన మనుషులు రూ.370 కోట్లు తినేశారు. అనేక షెల్ కంపెనీల ద్వారా డబ్బులు చేతులు మారి మనీ లాండరింగ్ జరిగి వీరి చేతుల్లోకి వచ్చింది. 2018 జూన్ లో అంటే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఒక వ్యక్తి ఏసీబీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం గురించి వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు అనంతరం ఏసీబీ విచారణ మొదలుపెట్టారు.
కానీ, ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాల అనుసారం వారు ఆ ఫైల్ ను పక్కన పెట్టారు. అంటే వారిని ఎవరు ఆపారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇది జరిగిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్ అన్నీ మాయం చేశారు. ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక పొరపాటును చేస్తాడు. కాబట్టి, వివిధ శాఖల్లోని షాడో ఫైల్స్ ద్వారా మేం ఈ తతంగాన్ని మొత్తం తవ్వడం ప్రారంభించాం.