హుజురాబాద్ కుతకుతలాడిపోతోంది. రగిలిపోవడం వెనుక కారణం ఎవరన్నదానిపై హై హీట్ రాజకీయం నడుస్తోంది. అంతటికీ రీజన్ దళితబంధు తాత్కాలిక బంద్ అవ్వడమే. కానీ కారణం ఎవరు.. బీజేపీ పంపిన లేఖతో ఆగిందా, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో నిలిచిపోయిందా.? టీఆర్‌ఎస్, బీజేపీ మాత్రం మాటలతోనే పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఎవరు కారకులు. బంధు బంద్ అయితే పొలిటికల్ మైలేజీ ఎవరికి? డ్యామేజీ ఎవరికి? అనే విషయానికొస్తే..
దళిత బంధు ఆపేయండి అని నిన్న రాత్రి వచ్చిన ఆదేశం. ఈ ఉదయానికే రియాక్షన్స్ రెడీ అయిపోయాయి. ముందుగా పొద్దుపొద్దునే హుజురాబాద్, దళితబంధుపై బండి సంజయ్ చేసిన ట్వీట్ చూద్దాం. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు ఆగిపోయిందంటూ మంటకుమరింత ఆజ్యం పోశారు
బండి సంజయ్. ఇంతకీ బంధు బందు కావడానికి కారకులెవరు? గులాబీ శ్రేణుల కామెంట్ ఏంటి? బీజేపీ రివర్స్ అటాక్ ఏం ప్లాన్ చేసింది? ఇందులో బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పాత్ర ఎలాంటిది? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి కీరోల్ ఎటువంటిది? టోటల్ గా హుజురాబాద్ లో దళిత బంధు ఆగడంలో పాత్ర ఎవరిది? అన్న డిస్కషన్ మొదలైంది.
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం.. హుజురాబాద్ లో ఆగిపోడానికి కారణం.. బీజేపీయే అన్నది అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న మెయిన్ కంప్లయింట్. ఈ దిశగా పార్టీలో ఉన్న నాయకులు.. బీజేపీపై అటాక్ స్టార్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి అయితే ఇది బీజేపీ ఉద్దేశ పూర్వక కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇందుకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలన్నది మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటున్న మాట.
బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి రాసిన లేఖ వల్లే దళిత బంధు ఆగిందన్నది మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ అటాక్.. దళిత బంధు అమలు కాకుండా అధికార పార్టీయే ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేసిందన్నది కమలనాథుల వాదన.. ఎన్నికల కోసమే పథకం తెచ్చారని బీజేపీ ఆరోపిస్తుంటే.. ఎన్నికల తర్వాత కూడా.. పథకం అమలవుతుంది. కావాలంటే చూడమన్నది టీఆర్ఎస్ సమాధానం.. టీఆర్ఎస్ బీజేపీ ఇలా మాటల యుద్ధం చేస్కుంటుంటే.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ పద్మనాభ రెడ్డి.. ఈ పథకంపై తాము భారత ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది వాస్తవమేనంటున్నారు. స్కీం బాగుంది కానీ టైమింగే కరెక్టు కాదని అంటున్నారు.
ఒక్క హుజురాబాద్ లో మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెడ్తున్నామన్నది సీఎం కేసీఆర్ అంటోన్న మాట. అంతే కాదు ఇది దళిత బంధు దగ్గరే ఆగదనీ.. ఇంకా ఎన్నో అట్టడుగు వర్గాల కోసం మరెన్నో కార్యక్రమాలను రూపొందిస్తాం అంటున్నారు సీఎం కేసీఆర్.. దళిత బంధు కేవలం హుజూరాబాద్ కోసం తెచ్చిన పథకం కాదు. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుంది. ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో ఆగినా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ పథకం నడుస్తుంది. కాబట్టి బేఫికర్ అన్నది టీఆర్ఎస్ చేస్తున్న వాదన. కానీ హుజూరాబాద్ లో అధికార పార్టీని ఇరుకున పెట్టి.. గెయినవ్వాలన్నది కమల వ్యూహం. ఇప్పుడీ బంధును బందు పెట్టడం వల్ల హుజూరాబాద్ ఎన్నికల బరిలో గెయినరెవరు- లూజరెవరు? లేఖ రాయడంతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న.. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి.. ఆన్సరేంటి?