– 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు
ఢిల్లీ: ఎయిర్ లైన్ ప్యాసింజర్ల కోసం DGCA కీలక నిర్ణయం తీసుకుంది.. విమానాలు ఆలస్యమైనప్పుడు వారికి ఎయిర్ లైన్ సంస్థలు తాగునీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. 2 గంటలు ఆలస్యమైతే వాటర్, 2-4 గంటలు లేట్ అయితే టీ/కాఫీ, స్నాక్స్, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే భోజనం ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొగ మంచు కారణంగా కొన్ని ఫ్లైట్స్ డిలే అవుతున్న సంగతి తెలిసిందే.