Suryaa.co.in

Telangana

లోకో పైలెట్ల సమస్యను పరిష్కరించండి

– దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండి సంజయ్
– బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి లోకోపైలెట్ల సమస్య పరిష్కారంపై చర్చ
– సానుకూలంగా స్పందించిన జీఎం
– సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న లోకో పైలెట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార జైన్ ను కోరారు. అందులో భాగంగా లోకో పైలెట్ల యూనియన్ నేతలను చర్చలకు పిలవాలని కోరారు.
బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి జీఎంను కలిసిన బండి సంజయ్ లోకోపైలెట్ల ఆందోళనతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. లోకోపైలెట్లు చేస్తున్న ఆందోళనతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

లోకోపైలెట్ యూనియన్ నేతలను చర్చలకు ఆహ్వానించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన రైల్వే జీఎం సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతోపాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి రైల్వే పనుల పురోగతిపైనా రైల్వే జీఎంతో బండి సంజయ్ చర్చించారు.

LEAVE A RESPONSE