– బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు
విజయవాడ: సహారా గ్రూప్ సేకరించిన డిపాజిట్లు చెల్లించే విషయంలో జాప్యం జరుగుతోందని పలువురు డిపాజిటర్లు బిజెపి వారధి కార్యక్రమం లో బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు కు ఫిర్యాదు చేశారు.
డిపాజిట్ లో ఉన్న పేరు కు ఆధార్ లో ఉన్న పేరు కు సారూప్యత లేదంటూ సహారా గ్రూప్ కంపెనీ డిపాజిట్లు సమయం దాటి నా చెల్లించకుండా డిపాజిట్ దారులను ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదు చేశారు.
ఈ విషయం పై బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు మాట్లాడుతూ.. అధికారులు దృష్టి కి తీసుకొని వెళ్తాము అని హామీ ఇచ్చారు.
గుడివాడ పట్టణానికి చెందిన మెరుగు వినోద్ కుమార్ తాను కొన్న ఇంటి స్థలానికి మూడు అడుగుల వెడల్పు దారిని వేరే వాళ్ళ ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర రావు తో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ పాల్గొన్నారు