– రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని, ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే కేసీఆర్ లక్ష్యం
– బీజేపీ లో చేరిన రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహా.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన రిటైర్డ్ డీజీపీ ఎస్.కె.జయచంద్ర, ఆయన కుమార్తె పాయల్ నేహా.
• కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్ కుమార్
అనంతరం మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, అధ్యక్షుడు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జెనవాడె సంగప్పలతో కలిసి మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.
బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోదీ విధానాలు నచ్చి రిటైర్డ్ డీజీపి ఎస్.కె.జయచంద్ర, వారి కూతురు పాయల్ నేహాలు బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నా. నిస్వార్థంగా పనిచేసే రిటైర్డ్ అధికారులు బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా చాలా మంది నేతలు బీజేపీలో చేరబోతున్నారు.
తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే మేధావి వర్గం బీజేపీలో చేరాలని కోరుతున్నా. సీఎంఓలో కొంతమంది తీరు, కేసీఆర్ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని, ఏటా వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు.
తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ చివరి ఘడియల్లోనైనా ఆ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని కోరుతున్నా.