-కేంద్రం వెనక్కి తీసుకున్న మీటర్లు ఎందుకు పెడుతున్నారు?
-కన్నబాబు సగం వ్యవసాయ శాఖను మూసేస్తే.. కాకాని పూర్తిగా మూసేశారు
-వ్యవసాయశాఖకు చెందిన మంత్రి జిల్లాలోనే 400 కోట్లు బకాయిలు ఉండటం సిగ్గుచేటు
-మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నేడు గోదావరి వరదల వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం వరదల విషయంలో ముందే ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయింది. దాదాపు 1500 కి.మీ లు ప్రయాణించి గోదావరి నదీ జలాలు వరదముంపు జరిగిన ప్రాంతానికి వస్తాయి. అటువంటిది ప్రభుత్వం ముందే వరదల గురించి ఎందుకు అంచనా వేయలేకపోయింది? అని శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
శనివారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సిడబ్ల్యూసి 12వ తేదిన రాష్ట్రాలని ముందే అలర్ట్ చేసింది. అయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చర్యలు శూన్యం. ఇంత విపత్కర పరిస్థితులు జరుగుతుంటే ప్రజలని పరామర్శించడానికి ముఖ్యమంత్రికి సమయం లేదు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ రాజప్రాసాదంలో 151 మంది ఎమ్మేల్యేలతో సమావేశాలు పెట్టి వారికి హెచ్చరికలు జారీ చేయడం దురదృష్టకరం.
నేడు వరద బాధితులకి ఏం సహాయం చేయబోతున్నారు?. కనీసం పక్క రాష్ట్రం చేస్తున్న సహాయ చర్యలు చూసి అయినా చేయాలనుకుంటున్నారా? లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు రైతులకి పంట నష్టం (ఎన్.డీ.ఆర్.యఫ్.నామ్స్) నేషనలో డిజాష్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ కు మించి సహాయం చేశారు.
గత మూడు సంవత్సరాలలో పంటలకు పెట్టుబడి విపరీతంగా పెరిగింది, ఎరువుల ధరలు అధికమయ్యాయి. ఎకరా వరి సేద్యానికి 12 నుంచి 15వేలు గడచిన మూడు సంవత్సరాలలో పెరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్.డీ.ఆర్.యఫ్.నామ్స్ కు మించి ఇచ్చిన ఆర్థిక సహాయం కూడ ప్రభుత్వం ఇవ్వదా? జగన్ మోహన్ రెడ్డికి రైతాంగం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం.
టీడీపీ హయాంలో హెక్టారుకి 20వేలు ఇచ్చాం. అరటికి ఎన్.డీ.ఆర్.యఫ్.నామ్స్ 25వేలు ఉంటే 30వేలు ఇచ్చాం. చెరుకు, పత్తికి హెక్టార్ కి 15వేలు ఇచ్చాం. కుటుంబాలు గాయపడిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చాం. ఇళ్ళు కూలిపోయిన వాళ్ళకి 50వేలు ఆర్థిక సాయం చేసి ఐ.ఎ.వై కింద ఇళ్ళు మంజూరు చేసి 4లక్షల పెట్టి ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఎన్.డీ.ఆర్.యఫ్.నామ్స్ 15వేలు ఇచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కనీసం హెక్టార్ కి 25వేలు వరి సేద్యానికి ఇవ్వాలి. నేడు జగన్ గాయపడిన కుటుంబాలకు 12వేల 7వందల రూపాయలు ఇస్తున్నాడు. బాధితులకు కనీసం లక్ష రూపాయలు కూడ అందజేయడం లేదు . లక్షా 80వేలు పెట్టి ఇల్లు కట్టించి ఇస్తాం, 12వేల 7వందలు గాయపడిన వాళ్లకి, ఇల్లు కూలిపోయిన వారికి 95వేలు ఇస్తాం అని చెబుతున్నారు. ఎందుకు ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రజల మీద కక్ష్యా, రైతులంటే ఇంకా ఎక్కువ కక్ష్యా ఎందుకు జగన్ రెడ్డికి ఇంతలా విద్వేషం?
పూర్తిగా ధ్వంసమైన పశువుల షెడ్లకి రెండు పశువులు ఉంటే లక్ష రూపాయలు, 4పశువులు ఉంటే లక్షన్నర, 6పశువులు ఉంటే లక్షా 80వేల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సహాయం చేశారు. నేడు వైసీపీ ప్రభుత్వం ధ్వంసమైన పశువుల షెడ్లకు పరిహారాన్ని ఇవ్వడంలేదు. పశువుల షెడ్ మరమ్మత్తుకి టీడీపీ 10వేలు ఇస్తే, వైసీపీ 2వేలు ఇస్తున్నారు. అక్వాకల్చర్ కి హెక్టార్ కి 30వేలు టీడీపీ ఇస్తే, వైసీపీ 8వేల 2వందలు ఇస్తున్నారు.
కనీసం ఆక్వాకల్చర్ కి 50వేలు, వరికి హెక్టార్ కి 25వేలు, అరటికి 50వేలు, చెరకుకు 30వేలు, పత్తికి 25 వేలు ఇవ్వాలి. మృతుల కుటుంబాలకి ఆర్థిక సహాయం కనీసం 25లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం ప్రజల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? దాదాపు 20వేల ఎకరాల పంట నష్టం జరిగింది. అరటితోటకు 40వేలు, తమలపాకు తోటకు 40వేల రూపాయలు పరిహారం ఇవ్వాలి. తెలంగాణలో లిబరల్ గా వరద సహాయం చేస్తున్నారు. అది కూడ చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరు. టీడీపీ హయాంలో వరదలకు తుఫానుకు దెబ్బతిన్న పంటకు 20వేలు, కొబ్బరి చెట్టుకు 15వందలు, ఇల్లు కూలిన వాళ్లకి ఇచ్చిన పరిహారాలు పెంచి సహాయం చేయాలి.
గతంలో భారతి సిమెంటు ధర ఇప్పుడు ఎంత పెరిగింది? ఎరువుల ధరలు ఎంత పెరిగాయి? టీడీపీ ఎన్.డీ.ఆర్.యఫ్.నామ్స్ కంటే ఎక్కువ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితులని బట్టి వైసీపీ దానికంటే ఎక్కువ ఇవ్వాలి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులని ముంచేసింది. అందుకే రైతు పోరులో వేల మంది రైతులు వచ్చి బ్రహ్మరథం పట్టారు, ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి నియోజక వర్గంలో కూడా ఇదే పరిస్థితి. శ్రీలంకతో పోల్చుతున్నారని అంటారు, వాళ్లు మాత్రం మూడు రాజధానులు ఆఫ్రికా దేశంతో పోలుస్తారు. శ్రీలంక జనాభా 2 కోట్ల 16 లక్షలు , అప్పు 2లక్షల 20వేల కోట్లు. సగటున ఒక్క వ్యక్తికి లక్ష రూపాయల అప్పు భారం పడుతుంది.
ఎ.పిలో జనాభా 5కోట్లు, అప్పు 8లక్షల 50వేల కోట్లు. ఒక్కోక్కరి మీద లక్షా 70వేల రూపాయల తలసరి అప్పు భారం పడుతుంది. దోచుకోవడానికి అప్పులని ఇష్టానుసారం చేస్తారు. వరద సాయం చేయడానికి మాత్రం ముందుకు రారు. మాట్లాడితే 95శాతం హామీలు అమలు చేశాం అని పాట పాడతారు. కరెంటు ఛార్జీలు పెంచుతామని చెప్పలేదు. ఉచితంగా వస్తున్న ఇసుకని దోచుకుంటామని చెప్పలేదు. పక్క రాష్ట్రంలో 88రూ డిజిల్ ధర ఉంటే ఇక్కడ 100రూ వసూల్ చేస్తారా? పక్క రాష్ట్రాల కంటే 12రూ అధనంగా వసూల్ చేస్తారని చెప్పలేదు.
పోలవరం విషయంలో కేంద్రం చెప్పిన మాటలని ప్రభుత్వం వక్రీకరిస్తుంది. మీకు పోలవరం నిర్మాణంలో ప్రణాళిక లేదు, మీ అధ్వర్యంలో పోలవరం ఆలస్యం అవుతుందని కేంద్రం చెప్పింది. నేటికి ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేని పరిస్థితులలో ఇరిగేషన్ మంత్రి ఉన్నారు. వ్యవసాయ శాఖని, నీటి పారుదల శాఖని ముంచేశారు. మీరు బడ్జెట్ లో చూపించిన ఇరిగేషన్ అగ్రికల్చర్ బడ్జెట్ కేటాయింపులలో 30శాతం ఖర్చుపెట్టడానికి దమ్ములేదు. వ్యవసాయ రంగంలో ఏ బడ్జెట్ కింద ఎంత ఖర్చుపెట్టారు. ఎకరా వరి సాగుకి 20వేలు పెట్టుబడి ఉన్నప్పుడు 20వేలు టీడీపీ ఇచ్చింది. మీరు 5వేలు తగ్గించి 15వేలు ఇస్తున్నారు. హెక్టారుకు పెట్టుబడి దాదాపు 35వేలు పెరిగింది. 5వేలు తగ్గించి ఇవ్వడం ఎక్కడి న్యాయం? కనీసం 25వేలు ఇవ్వాలి. కరెంటు మీటర్ల విషయంలో కేంద్రం వెనక్కి తీసుకున్న తరువాత క్వాలిటీ ఆఫ్ కరెంటు అని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడమేంటి? 2020లో కేంద్రం తీసుకున్న నిర్ణయం మీటర్లు పెట్టమని దాన్ని కేబినెట్ లో వెనక్కి తీసుకుంది. ఇతర రాష్ట్రాలు మీటర్లు పెట్టమని ఎదురు తిరిగాయి.
కేంద్రం వెనక్కి తీసుకున్న మీటర్లు ఎందుకు పెడుతున్నారు? మీటర్ల మాటున మీకు వస్తున్న వేల కోట్ల కమీషన్, ఆక్వాకల్చర్ రైతులకి మీటరుకి ఒకటిన్నర రూపాయి అని 4రూపాయల 85పైసలు వసూలు చేస్తున్నారు. జోన్, నాన్ జోన్ అని 40హెచ్.పి దాటితే 4రూపాయల 85పైసలు వేస్తున్నారు. 2ఎకరాల రైతుకి బోరు, మోటర్లు, వేరియేటర్స్ కి 40హెచ్.పి కావాల్సివస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మూసేసింది. కన్నబాబు సగం వ్యవసాయ శాఖను మూసేస్తే.. కాకాని పూర్తిగా మూసేశారు. రాష్ట్రంలో 63 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడివున్నారు.
రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇది మేం ఆరోపించడంకాదు సీఐసీపీ స్పష్టంగా చెప్పింది. సగటున 213 రూపాయలు ఒక్కో క్వింటా మీద ఆంధ్రప్రదేశ్ రైతులకు నష్టం జరుగుతోందని సీఐసీపీ తెల్పింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ 200 అని చెప్పారు. క్వింటాకు 450 రూపాయలు మద్దతు ధరమీద ఆంధ్రప్రదేశ్ రైతాంగం ధాన్యంలో నష్టపోయారు. బీబీసీ అంతర్జాతీయ మీడియా ఏపీ మైక్రో ఇరిగేషన్ ను మూత వేసిందని స్పష్టంగా తెలిపింది. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు తెస్తున్నామని చెప్పారు? ఆ మార్పులు ఏవో తెలపాలి. శాఖనే మూసేసి మార్పులంటే ఎలా?
రైతులు కష్టాల్లో ఉంటే జగన్ ఎప్పుడైనా ఏ రైతునైనా కలిశాడా? కన్నబాబు, కాకాని ఏ రైతునైనా కలిశారా? వారి పొలాలవద్దకు వెళ్లినట్లు చూపగలరా? రాష్ట్రంలో రైతులకు 2వేల కోట్లు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు బకాయిలున్నాయి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 400 కోట్లు బకాయిలు ఇవ్వాల్సివుంది. వ్యవసాయశాఖకు చెందిన మంత్రి జిల్లాలోనే 400 కోట్లు బకాయిలు ఉండటం సిగ్గుచేటు. వరద ప్రాంతాల్లో నష్టపోయిన కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు, పంటలు నష్టపోయిన రైతాంగానికి న్యాయమైన పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.