– ట్విట్టర్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి…
దేశంలో ఒకవైపు అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు, మరోవైపు జెండా పండగలు జరుగుతుంటే ఏపీలో మాత్రం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నప్రదర్శనలు చూడాల్సివస్తోంది. ఇలా సరససల్లాపాల్లో పాల్పంచుకుంటూ రేప్ కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం సీఎం జగన్ కి అలవాటుగా మారింది. కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపివుండాలి. వైసీపీ ప్రవర్తన, వాడుతున్న భాష చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్ని ప్రజలకు తెచ్చారు. ఒకప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ ఈ రోజు వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీలకు కేరాఫ్ గా మారడం దురదృష్టకరం.