-శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులను దండయాత్ర చేస్తున్నారని అనడం ఫ్యాక్షనిస్టు మనస్థత్వం
-ఉత్తరాంధ్ర సంస్కృతిని నాశనం చేస్తున్న వారిని ఎదుర్కోకుండ శాంతీయుతంగా పాదయాత్ర చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు
-జనాన్ని రెచ్చగొట్టి అశాంతి సృష్టించి ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టడం కోవడం మానుకోవాలి
-ప్రపంచంలోనే సౌత్ ఆఫ్రికాలో విఫలమైన మూడు రాజధానుల పార్ములాను తీసుకోవడం అవివేకం
-రాజధానిగా ఉండే నగరమే అభివృద్ధి చెందుతుందనడం అవాస్తవం
– మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అమరావతి రైతులు రాజధాని కోసం అనేక త్యాగాలు చేశారు. 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి అందజేశారు. అలాంటివారు నేడు మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండని దండం పెడుతూ పాదయాత్ర చేస్తుంటే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, మరికొందరు ఇది పాదయాత్ర కాదు దండయాత్ర అంటున్నారు. ఇది దండయాత్ర ఎలా అవుతుందో చెప్పాలి. అమరావతి రైతులు కత్తులు, తుపాకులు చేతపట్టుకొని రావడంలేదు కదా?. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు తీసుకొచ్చారు. ఈ మూడు రాజధానుల్లో అభివృద్ధి లేదు. సౌత్ ఆఫ్రికాలో జోహన్ బర్గ్ మాత్రమే అభివృద్ధి చెందింది. మూడు రాజధానుల వల్ల ఉపయోగం లేదని, ఒక్క రాజధాని చేయాలని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో చేసిన ఏకైక మూడు రాజధానుల ప్రయోగం విఫలమైంది.
అమెరికా రాజధానియైన వాషింగ్టన్ డిసి అలానే ఉంది. కానీ, చికాగో, న్యూయార్క్ లు రాజధానులు కాకపోయినప్పటికీ అక్కడే అభివృద్ధి కనబడుతోంది. రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి కాదు. యునైటెడ్ కింగ్ డమ్ లోని మాంచెష్టర్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. యుకె రాజధాని లండన్ అయినా మాంచెష్టర్ లో అభివృద్ధి జరిగింది. విఫలమైన మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ఏపీలో పెడతామంటున్నారు.
శాసనరాజధాని అనేది రాంగ్ కాన్సెప్ట్. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఒక అసెంబ్లీ జరుగుతుంది. బాంబేలో ఒక అసెంబ్లీ జరుగుతుంది. నాగ్ పూర్ లో అసెంబ్లీ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఖర్చు వస్తోంది. అందుకే ప్రస్తుతం నాగ్ పూర్ లో అసెంబ్లీ వద్దంటున్నారు. సమావేశాలు జరిగే సమయంలో సీఎం, మంత్రులు, అధికారులు అక్కడకు రావాలి, మళ్లీ అందరూ ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. నాగ్ పూర్ లో అసెంబ్లీ సమావేశాలు రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.
అమరావతి రాజధానిగా బీజేపీ, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు కావాలంటున్నాయి. గతంలో వైసీపీ కూడా అమరావతే రాజధాని అని అసెంబ్లీలో కుండ బద్దలు కొట్టి చెప్పింది. మూడు రాజధానులు పెట్టాక ఏపీకి రాజధాని ఏది అంటే ఏం చెబుతారు? మూడు రాజధానులు అంటే ఎవరు పెట్టుబడిపెట్టేందుకు ముందుకొస్తారు? రాజధానికి ఎవరు పెట్టుబడి పెట్టగలరు? హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి లేదనడం అవాస్తవం. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు విశాఖపట్నం, వరంగల్ లు అభివృద్ధి చెందాయి. విశాఖలో ఉత్పత్తి రంగం అభివృద్ధి జరగాలంటే ఓడరేవు కావాలి. ఆ పరిస్తితులు అక్కడ ఉన్నాయి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మౌళిక సదుపాయాలు, పెద్ద పెద్ద కంపెనీలు కావాలి.
విశాఖలో సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలాన ఐటీ ఇండస్ట్రీస్ రాలేదు. కానీ, పెంటెక్స్ లో 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బి.హెచ్.ఈ.ఎల్, హిందుస్థాన్ షిప్ యార్డు, హిందుస్థాన్ జింక్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, రిఫైనరీస్, ఫార్మా సెక్టార్ లు విశాఖలో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అభివృద్ది అనుకూలంగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీసీటీ ఫాక్స్ కాన్ లో 30 వేల మంది పనిచేస్తున్నారు. వీటిని ఇంకా విస్తృతం చేస్తే అధికంగా మరో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయంటున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్, బొత్స లు విశాఖలో వ్యాక్స్ వ్యాగిన్ ను తీసుకురావాలని ప్రయత్నించారు. వారికి 11 కోట్లు లంచం కూడా ఇచ్చారు.
ఇది రుజువై బొత్స సత్యనారాయణ రాజీనామా కూడా చేశారు. మా ఉద్యోగుల రిక్రియేషన్ కు ఒక పబ్ లేదు, ఒక క్లబ్ లేదు అని నిరాకరించడం జరిగింది. ఎక్కడ ఏ అభివృద్ధి జరగాలో అక్కడ ఆ అభివృద్ధి జరగాలి. బెంగళూరు ఎయిర్ పోర్టు అనంతపురం కు దగ్గర. పైగా అనంతపురం హైవే పై ఉంది. అక్కడ ఐటీ ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయాలి. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషన్, హబ్ గా అభివృద్ది చేయాలి. అందుకే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏయిమ్స్ హాస్పిటల్, ఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ, విట్ లాంటి సంస్థలు తెచ్చారు. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. అంతేకాకుండా జాతీయ విద్యా సంస్థలు లాంటి 125 ఇన్సిటిట్యూషన్స్ తెచ్చేందుకు భూ కేటాయింపులు కూడా చేశారు. కొన్ని నిర్మాణాలు జరుగుతుండగా ఆగిపోయాయి.
విశాఖ, ఉత్తరాంధ్రని డెవలప్ చేయాలి. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రాష్ట్రానికి నడిబొడ్డున ఉండే అమరావతిని డెవలప్ చేయాలి. రాయలసీమ, అనంతపురం జిల్లాలను అభివృద్ధి చేయాలి. నెల్లూరు, శ్రీసిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేయాలి. ప్రణాళికలు తయారు చేయడం మరచిపోయి.. త్యాగాలు చేసి, మోసపోయి పాదయాత్ర చేస్తున్న రైతులను ఇబ్బందులపాలు చేయడం సరికాదు. అమెరికాలో వాషింగ్టన్ డీసీ, ఇంగ్లాండ్ లో లండన్ అనేక సంవత్సరాలుగా రాజధానులుగా ఉన్నాయి. కానీ అవి నగరాలుగానే ఉండిపోయాయి.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేకపోయాయి. విశాఖలో రాజధాని పెడితే అభివృద్ధి జరుగుతుందా?. విశాఖ ఆల్ రెడీ అభివృద్ధి చెందిన నగరం. వోక్స్ వ్యాగిన్ ఎందుకు రాలేదో ఆలోచించాలి. అమరావతి రైతులు చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేశారు. పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ పెట్టాలి. అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. విశాఖను ఇప్పటికే విజయసాయి రెడ్డి టీం ఆక్రమించుకుని అక్కడ కల్చర్ ని నాశనం చేస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్ లాంటి వారు ఉత్తరాంధ్రను తమ కభంద హస్తాలలో పెట్టుకుని అక్కడి సంస్కృతిని నాశనం చేస్తున్న వారిని ఎదుర్కోకుండ శాంతీయుతంగా పాదయాత్ర చేస్తున్న వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు.
అమరావతిలో మరో రూ. 2000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తిస్థాయిలో పరిపాలన అందుబాటులోకి వస్తుంది. అమరావతి అభివృద్ధి చెందడం ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతోంది. జనాన్ని రెచ్చగొట్టి అశాంతి సృష్టించి, ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టడం కోవడం మానుకోవాలి. అనంతపురం నుంచి అమరావతికి ప్రయాణించాలంటే 12 గంటలు సమయం పడుతుంది. అక్కడ నుంచి విశాఖకు వెళ్లాలంటే మరో ఆరేడు గంటలు ప్రయాణించమని చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్రం నడిబొడ్డున ఉండే రాజధానిని కూల్చాలనుకోవడం దుర్మార్గం. అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి రూ. 2 లక్షల కోట్ల ఆస్తి పోగై 175 నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.