Suryaa.co.in

Andhra Pradesh

సర్కారుపై సోము వీర్రాజు ఫైర్

-సినిమాలో టికెట్స్ ధరలు తగ్గించినప్పుడు.. టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్స్ పెంచడం ఏంటి?

ఒంగోలు : ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకు రావడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి మరళీధరన్ ఈవిషయంలో పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. నిరంతరం దౌత్యవేత్త లతో మాట్లాడుతున్నారు.

సినిమాల విషయంలో ప్రభుత్వం పాత్ర ఎందుకు? ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విషయంలో బెనిఫిట్ షోస్ ఎత్తియడం దారుణం.సినిమాలో టికెట్స్ ధరలు తగ్గించినప్పుడు.. టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్స్ పెంచడం ఏంటి?

దర్శనాల టికెట్స్ పెంచడం వలన సమాన్యభక్తులకు ఇబ్బంది పడరా? విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని కేంద్రం భావిస్తుంది.. వివిధ రూపాలలో కేంద్రం ఏపీకి నిధులు భారీగా మంజూరు చేస్తోంది.
somu-on వైసీపీ ప్రభుత్వం కేంద్రం నిధులను వివిధ అవసరాలకు వాడేస్తుంది.కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తుంది.

జగన్ అన్న కాలనీలకు కేంద్రం 32వేల కోట్ల నిధులు మంజూరు చేసింది. ఫుడ్ సబ్సిడీ కింద కేంద్రం ఏపీకి వేలకోట్లు ఇచ్చింది. కేంద్రం మంజూరు చేస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమంలు జరుగుతున్నాయి. మేము అభివృద్ధి చేస్తుంటే… రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, ఎర్ర చందనం , లిక్కర్ ట్రేడింగ్ చేస్తోంది.

పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాల వ్యయం పెంచుతూ.. కేంద్రం నుంచి వచ్చే నిధులను బుక్కేస్తున్నారు. అమరావతి లోనే… ఏపీ క్యాపిటల్ ఉండాలి..
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శిరసనగండ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ నాయకులు యడ్లపాటి రఘునాధరావు,నాగోతు రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE