-రైల్వే అస్తులు ధ్వంసం వెనుక కుట్రవుంది
-బిజెపి రాష్ట్ర అద్యక్షుడు సోమువీర్రాజు
విజయవాడ..యువతకు భారత సైన్యంలో అవకాశం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పధకం యువతకు చాలా ఉపయోగకరం. అయితే ఈ విషయాలు తెలియని యువత అవేశాలకు లోను అవుతున్నారు .సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్ లలో విధ్వంసం స్రృష్టించిన వారు సంఘవిద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు.
భారత సైన్యం లో చేరాలని కలలుకంటున్న యవతకు అగ్నిపథ్ ఒక సువర్ణావకాశం లాంటిదని సోమువీర్రాజు వివరించారు.అగ్నిపథ్ వల్ల అనేక ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయని అందువల్ల ఆందోళనలు చేయవద్దన్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులతో ప్రధాని పై వ్యతిరేక ప్రచారం చేసేవారు కలసి నిర్వహిస్తున్నవిద్వసంగా కనపడుతోందన్నారు.
అగ్నిపథ్ లో బేసిక్ జీతం ఇతర సౌకర్యాలు చూస్తే నే ఎంత ఉపయోగం ఉంటుందో అర్ధం అవుతోంది అయితే కొందరు విధ్వంసకర శక్తులతో చేతులు కలపి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని సోమువీర్రాజు మండిపడ్దారు.
ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం రాష్ట్రప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. రైల్వే ఆస్తులను టార్గెట్ చేసుకుని ధ్వంసం చేసారంటే సంఘవిద్రోహ శక్తులు ఒక పధకం ప్రకారం దాడలు చేస్తున్నారని అర్ధం అవుతోంది. యువత కు అవేశం వచ్చి న ఉధ్యమం కాదు.ప్రభుత్వ వ్యతిరేక శక్తుల కుట్రగానే కనపడతోందని సోమువీర్రాజు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.