Suryaa.co.in

Andhra Pradesh

దివ్య కాశీ.. భవ్య కాశీలైవ్ స్క్రీన్ ను వీక్షించిన సోము వీర్రాజు

దివ్య కాశీ.. భవ్య కాశీ… కార్యక్రమాన్ని,తూర్పుగోదావరి జిల్లా తుని శివారు తపోవనంలో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. కాశీ విశ్వనాధుని కారిడార్ ను ప్రధాని మోదీ ప్రారంభించిన,ఈ కార్యక్రమాన్ని లైవ్ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆశ్రమం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,నాయకులు వీక్షించారు.
దివ్య కాశి..భవ్య కాశి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ, హిందువులు పవిత్రంగా భావించే కాశీ పుణ్యక్షేత్రాన్ని మోదీ ఆధునీకరించి,దివ్యకాశీగా

తీర్చిదిద్దారని సోము వీర్రాజు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ కాశీ నీ దివ్య కాశీ గా మార్చేశారని ఆయన తెలిపారు.ఈ దివ్య కాశీ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న అన్ని శివాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా తపోవనం పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ మాట్లాడారు.
ఆధ్యాత్మిక ,సామాజిక, సాంస్కృతిక రాజధాని అయిన కాశీ విశ్వనాధుని ఆలయం మోదీ అభివృద్ధి చేసి,దివ్యమైన కాశీగా అభివృద్ధి చేయడం ఆనందదాయకమని తపోవనం ఆశ్రమ పీఠాధిపతి సరస్వతీ సచ్చిదానంద స్వామీజీ పేర్కొన్నారు.అనంతరం స్వామీజీ ఆశీస్సులను పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు,నాయకులు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE