– వైసీపీ నేతలు బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఎండగడతాం
-రాజ్యసభ ఎంపీ అయ్యింది బీసీలను ముందుకు తీసుకెళ్లడానికా? ఆయన ముందుకు వెళ్లడానికా?
-కాపులు నేడు కాలరేగరేసుకొని తిరగగలుగుతున్నారంటే అది చంద్రబాబునాయుడు చలువే
– మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న
త్వరలో బీసీ అగ్ర నేతలందరూ కలిసి విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, ఈ సమావేశంలో వైసీపీ నేతలు బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఎండగడతామని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు మీ కోసం… !
పూటకు ఒకపార్టీ మార్చే వ్యక్తి ఆర్ కృష్ణయ్య
. అలాంటి వ్యక్తిని బీసీల ప్రతినిధి అని చెప్పుకోవడానికి బీసీలు సిగ్గుపడుతున్నారు.
జగన్ రెడ్డికి, ఆర్ కృష్ణయ్యకు బీసీ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.
జగన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం పేరు రెడ్డాంధ్రప్రదేశ్ గా మార్చేస్తాడు.
పూటకు ఒక పార్టీని మార్చే ఆర్ క్రిష్టయ్య లాంటి వాళ్లను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో బీసీలను అణగత్రొక్కే ప్రయత్నం జరుగుతోంది. క్రిష్ణయ్యకు నయీం గ్యాంగుతో కూడా సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని బీసీల ప్రతినిధి అనడం సిగ్గుచేటు. పార్టీలకు ఊడిగం చేసే వ్యక్తులు కులసంఘాలు పెట్టుకుని మేం వారి ప్రతినిధులం అని చెప్పుకోవడం ఆ వర్గాలను మోసం చేయడమే అవుతుంది. ఆర్ కృష్ణయ్య బీసీలందరినీ జగన్ రెడ్డికి హోల్ సేల్ గా అమ్మేస్తున్నాడు. జగన్ రెడ్డికి కృష్ణయ్య భజన చేయడమే కాకుండా బీసీలందర్నీ కూడా జగన్ భజన చేయమని చెబుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని బీసీ ప్రతినిధి అని చెప్పుకోవడానికి బీసీలు అవమానంగా భావిస్తున్నారు. కృష్ణయ్య మొదట టిడిపి లో, తర్వాత కేసీఆర్ తో, అటు తర్వాత సొంత పార్టీ పెడుతున్నానని ప్రచారం చేసి ఇప్పుడు జగన్ తో ఉన్నారు. అందుకే ఇతనిని పూటకొక పార్టీ మార్చే వ్యక్తి అని అంటున్నాం. గత ముప్పై ఏళ్లుగా బీసీలను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసిన వ్యక్తి కృష్ణయ్య.
మూడున్నరేళ్లలో 24 మంది బీసీలను హత్య చేయించిన జగన్ రెడ్డిని బీసీ ఉద్దారకుడు అని చెప్పేందుకు కృష్ణయ్యకు ఏమాత్రం సిగ్గులేదు. అనేక వందలమందిని బీసీ యువకులపై, సామాన్యులపై దాడులు చేసి కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నది చాలక.. జగన్ రెడ్డి కులాల కుంపటి రాజేయాలని చూస్తున్నాడు. నాయకుడనేవాడు ప్రజలను ఏకం చేయాలి. కానీ జగన్ రెడ్డి మాత్రం ప్రజలను ముక్కలు చేసి ఆనందపడాలనుకుంటున్నాడు.
జగన్ రెడ్డి కుటుంబ వైభవం బీసీల శవాలపై నిర్మించుకున్నది. జగన్ రెడ్డి తాత రాజారెడ్డి జింకా వెంకటనరసయ్య అనే బీసీ వ్యక్తిని హత్యచేసి మంగంపేటలో బైరటీస్ గనిని కబ్జా చేశాడు. ధనగణన తప్ప బీసీ జనగణన జగన్ రెడ్డికి పట్టడం లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో బీసీ జనగనణ చేయాల్సిందేనని శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దాన్ని వదిలేసిన వ్యక్తి జగన్ రెడ్డి. 28 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసిన జగన్ రెడ్డి ఒక్క పర్యాయం కూడా బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని అడగలేదు. నేడు బీసీ జనాభా గణనీయంగా పెరిగినా ఆ లెక్కలు లేక అనేక ప్రభుత్వ పథకాలలో బీసీలు ప్రాధాన్యత కోల్పోతున్నారు.
బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ టిడిపి. మహానాయకుడు.. అన్న ఎన్టీఆర్ బీసీలను ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మరో నాలుగడుగులు ముందుకేసి బీసీ సాధికారత కోసం ఎంతో శ్రమించారు. నేడు బీసీ యువకులు విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు చలవే. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి గానీ, ఆర్ కృష్ణయ్యకు గానీ లేదు. ఆర్ కృష్ణయ్య బీసీలకు న్యాయం చేస్తారని తలచి తెలంగాణలో చంద్రబాబునాయుడు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. బీసీలను నిలువునా ముంచి తన స్వార్ధం కోసం వెళ్లిపోయిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు వారి దామాషా ప్రకారం వారికి పదవులు ఇస్తే నేడు జగన్ రెడ్డి వారి స్థానాల్లో రెడ్డీలతో నింపేశాడు. ఎస్వీ యూనివర్శిటీలో వీసీగా బీసీయైన జానకిరామయ్యకు దక్కాల్సిన పదవి ఒక రెడ్డికి కట్టబెట్టారు. టిటిడికీ సంబంధించిన మొత్తం పదవులను జగన్ రెడ్డి రెడ్డీ సామాజిక వర్గంతో నింపేశారు. జగన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రెడ్డాంధ్రప్రదేశ్ అని పేరు మార్చేస్తాడు. 2019 ఎన్నికలకు ముందు డీఎస్పీ పదవుల్లో 5 మంది కమ్మ కులస్తులు ఉంటే 35 మంది ఉన్నారని తప్పుడు లెక్కలు ఇచ్చాడు జగన్ రెడ్డి. నేడు నేను చెప్పే లెక్కలపై దమ్ముంటే జగన్ రెడ్డి చర్చకు రావాలి.
ఆర్ కృష్ణయ్య బీసీల ద్రోహి. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు, ఆర్ కృష్ణయ్యకు లేదు. రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా ముక్కలు చేశారు. జగన్ రెడ్డి బీసీవర్గాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బీసీలకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. మిగతా పార్టీలేవీ బీసీలకు అండగా నిలవవు. చంద్రబాబు ఎక్కడైనా సరే సీటుపై కూర్చునేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అవతల ఉంటే పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అది నాయకత్వ లక్షణం. మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారో వారికే మేం జై కొడతాం. చంద్రబాబు వైపు బీసీలున్నందున బీసీలపై వైసీపీకి ప్రేమ పుట్టుకొస్తోంది. చంద్రబాబునాయుడు దగ్గర నుంచి బీసీలను దూరం చేయడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. 56 మందిని కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమించారు. వారికి కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు. నిధులు లేవు. బీసీ సంక్షేమ నిధులు లేవు. బీసీ, కాపు కార్పొరేషన్లకు ఎంతిచ్చారో చెప్పాలి. బీసీలను ఉక్కుపాదంతో అణగదొక్కుతున్నారు.
ఆర్. కృష్ణయ్య తన తలను జగన్ దగ్గర తాకట్టు పెట్టారు. ఆర్. కృష్ణయ్యకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలకోసం పోరాడే పార్టీ తెలుగుదేశం ఒక్కటే. బీసీల హక్కులకోసం పోరాటం చేస్తున్నాం. ఆల్ ఇండియా బీసీ సంఘం అధ్యక్షుడిగా ఆర్. కృష్ణయ్యను ఎవరూ ఎన్నుకోలేదు. తనకు తానే చెప్పుకుంటున్నారు. జగన్ కు బీసీలంటే ఎందుకంత కక్ష? బీసీలను విడదీద్దామనే ఆలోచన మానుకోవాలి. బీసీలందరూ ప్రేమించే వ్యక్తి చంద్రబాబునాయుడు. బీసీలను అద్భుతంగా పైకి తీసుకురావాలనుకునే వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగదు. చిన్నచిన్న వ్యాపారస్థులు బీసీలు. రాష్ట్రంలో పనులు లేక అల్లాడుతున్నారు. సంవత్సరానికి పదివేలు వేస్తే సరిపోతుందా? సంవత్సరానికి పదివేలతో బతుకు ఈడ్చగలవా జగన్…! ఆర్. కృష్ణయ్యకు ఎక్కడా నాయకత్వం పోరాట పటిమ లేదు. ఆర్. కృష్ణయ్య బీసీలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆర్. కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి తరువాత మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. 2019లో తగుదునమ్మా అని మంగళగిరిలో లోకేష్ బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
ఒక ఉద్యమకారుడు ఇన్ని పార్టీలు మారడం హాస్యాస్పదం. కులసంఘ నాయకుల్లో ఎక్కువ పార్టీలు మారిన వ్యక్తి ఆర్. కృష్ణయ్యే. ? గతంలో టీడీపీ సీఎం క్యాండిట్ గా ప్రకటించింది. పోరాటం చేయలేక వెనక్కి వెళ్లిపోయారు. గతంలో టీఆర్ ఎస్ కు కూడా మద్దతు పలికారు. వైసీపీలోకి వెళ్లావు. ఇన్ని పార్టీలు మారించి బీసీలను ఉద్ధరించడానికా? స్వార్థ ప్రయోజనాలకా ప్రజలే చెప్పాలి. సొంత ప్రయోజనాలకోసమే ఇన్ని పార్టీలు మారారు. ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరమేమొచ్చింది? బీసీలకు మనుగడ ఉండాలంటే చంద్రబాబుతోనే సాధ్యం. బీసీల వద్దకు వెళ్లి మా గోడు చెప్పుకుంటాం. బీసీల అభివృద్ధికి మేం పాటుపడతాం. ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేక ప్రభుత్వం. బస్ యాత్ర పెట్టి వైసీపీ భరతం పడతాం. టీడీపీ హయాంలో ఎన్టీరారామారావు, చంద్రబాబులు ఎంతో అండగా నిలిచారు. ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేయలేదు. ఈ విషయాలన్నీ బస్సు యాత్ర ద్వారా తెలుపుతామని తెలిపారు.